AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Death: దెయ్యాల దీవిలో ఎటు చూసినా ఆర్తనాదాలే..! ఒక్కరిద్దరు కాదు, లక్షమందిని మింగేసింది..

దీవులు..అన్న మాట వినగానే ఇట్టే గుర్తుకువచ్చేది పగడపు దీవులు.. చుట్టూ సముద్రం, అందమైన తీరాలు, మధ్యలో అడవులతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి దీవుల మీద

Black Death: దెయ్యాల దీవిలో ఎటు చూసినా ఆర్తనాదాలే..! ఒక్కరిద్దరు కాదు, లక్షమందిని మింగేసింది..
Poveglia Island
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2022 | 1:57 PM

Share

దీవులు..అన్న మాట వినగానే ఇట్టే గుర్తుకువచ్చేది పగడపు దీవులు.. చుట్టూ సముద్రం, అందమైన తీరాలు, మధ్యలో అడవులతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి దీవుల మీద పలు సినిమాల్లో సన్నివేశాలు, పాఠాలు కూడా చూస్తుంటాం. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీవులు మాత్రం అలాంటివి కాదు..ఇవీ పిశాచాలకు నెలవు..పదులు, వందలు కాదు..ఏకంగా 1,60,000 మందిని మింగేసిన మృత్యుదీవులు..అందుకే వాటి సందర్శనకు వీల్లేదు. అక్కడికి వెళ్లేందుకు పర్యాటకులకు అనుమతి లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటలీ… వెనిస్, లిడో తీరంలో.. పోవెగ్లియా దీవి (Poveglia Island) ఉంది. దీన్నే పిశాచాల దీవిగా పిలుస్తారు. అక్కడ మనుషులుండరు..గతంలో అక్కడ బ్లాక్ డెత్ వ్యాధి సోకిన పేషెంట్లను చిత్రహింసలు పెట్టి చంపేశారని వార్తలు. ఆ ఘటనలో 1,60,000 మంది మృత్యువాతపడ్డారట. అనంతరం ఆ దీవిపై పర్యాటకులకు అనుమతి నిషేదించారట. కానీ, వాస్తవానికి ఈ దీవులు ఎంతో అందంగా,ఆహ్లాదభరితంగా ఉండేవి. దీవి చుట్టూ నీలి రంగులో సముద్రపు నీరు కనిపిస్తుంది. అందమైన తీరాలు, దీవి మధ్యలో ఉన్న చర్చి చుట్టూ పచ్చదనం మనసుకు ప్రశాంతతనిస్తుంది.

అయితే, అంత అందమైన దీవి ఇప్పుడెందుకు దెయ్యాలకు నెలవైందన్నది ఓ పెద్ద చరిత్ర…ఒకప్పుడు ఇటలీలో వ్యాపించిన బ్లాక్ డెత్ (Black Death) వ్యాధి మరింత మందికి ప్రబలకుండా ఉండేందుకు మొత్తం రోగుల్ని ఇక్కడ బతికి ఉండగానే సజీవదహనం చేసేవారట. అలా మొత్తం 1,60,000 మందిని తగలబెట్టి చంపినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ దీవిలోని మట్టిలో దాదాపు 50 శాతం బూడిద కనిపిస్తుంది. అదంతా అప్పట్లో తగలబెట్టిన మనుషులదేనని సమీప ప్రజలు చెబుతున్న మాట. యూరప్ నుంచి బ్లాక్ డెత్ వ్యాధి వెళ్లిపోయిన తర్వాత… 1900 సమయంలో అక్కడ మానసిక వికలాంగులకు కొందరు డాక్టర్లు సేవలు అందించేవారు. ఐతే… ఓ డాక్టర్ మాత్రం తన రోగుల్ని హింసిస్తూ, చంపేసేవాడని, వారిని అత్యంత దారుణంగా ముక్కలుగా కోసి చంపేవాడట. తన పేషెంట్లపై అతను విచిత్రమైన ప్రయోగాలు చేసేవాడట. అక్కడ తనకోసం ఏర్పాటు చేసుకున్న ఓ ల్యాబ్‌ ఇప్పటికీ సాక్ష్యంగానే ఉందట. అదే ల్యాబ్‌లో అతడు తన రోగులను చిత్ర హింసలుపెడుతూ హతమార్చేవాడట. అతని చేతిలో చనిపోయిన రోగుల ఆర్తనాదాలు… మిగతా రోగులకు ముచ్చెమటలు పట్టించేవట..అలా కాలక్రమేణ ఆ ప్రాంతం భయంకర నరకంగా మారింది. చివరకు దెయ్యాలకు నెలవుగా పేరుపోయింది.

ఇవి కూడా చదవండి