Telangana: బిందెలో ఇరుక్కుపోయిన బాలుడి తల.. సాయం చేసిన స్వర్ణకారుడు..!

పిల్లాడి తల బిందెలో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఓ 5 ఏళ్ల బాలుడు.. బిందెతో ఆడుకుంటున్నాడు. ఇంతలో స్టీల్​ బిందెలో తల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా...

Telangana: బిందెలో ఇరుక్కుపోయిన బాలుడి తల.. సాయం చేసిన స్వర్ణకారుడు..!
Boy Head
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2022 | 11:37 AM

పిల్లాడి తల బిందెలో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఓ 5 ఏళ్ల బాలుడు.. బిందెతో ఆడుకుంటున్నాడు. ఇంతలో స్టీల్​ బిందెలో తల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా… ఆ బిందె నుంచి తల బయటకు రాలేదు. బిడ్డకు ఏమవుతుందో అని తల్లిదండ్రులు స్థానికులు ఆందోళనలో పడ్డారు. తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామానికి చెందిన సీత వెంకన్న -భవానీ ల దంపతుల కుమారుడు రిశాంత్..మూడేళ్ల రిశాంత్‌.. ఉదయం నుంచి పిల్లలతో ఆడుకున్నాడు. ఇక తిరిగి ఇంటికి వచ్చిన బాలుడు ఇంట్లోని ఖాళీ బిందెలతో ఆడుకోవటం మొదలు పెట్టాడు. సరదాగా బిందెలో తలదూర్చి మాట్లాడుతూ, పాటలు పాడుతూ ఆడసాగాడు. కానీ, అంతలోనే ఆకస్మాత్తుగా రిశాంత్‌ తల బిందె లో ఇరుక్కుపోయింది. దాంతో ఆ పిల్లాడికి ఊపిరాడలేదు. గట్టి గట్టిగా కేకలు వేయటం మొదలు పెట్టాడు. అది విన్న తల్లిదండ్రులు, స్థానికులు బిందెలోంచి బాలుడి తలను తీసే ప్రయత్నం చేశారు. ఎంతకు రాకపోవడంతో బంగారు షాపులో ఉండే కట్టర్ సహాయంతో బిందెను కట్ చేసి అందులోంచి తలను బయటకు తీసారు. ఊపిరి ఆడని పిల్లాడు తల బయటకు రాగానే శ్వాస అందకపోవటంతో కాస్త అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం కోలుకోని ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇంతలో ఈ వార్త చుట్టుపక్కల వారికి తెలియడంతో సంఘటన స్థలానికి పరుగులు పెట్టారు.. బిందెలోంచి తల బయటకు రావడంతో కథ సుఖాంతమైంది.