Covid Vaccine Drive: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేటి నుంచి ఇంటింటికీ వ్యాక్సిన్..

Covid Vaccine Drive: కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్..

Covid Vaccine Drive: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేటి నుంచి ఇంటింటికీ వ్యాక్సిన్..
Covid Vaccine Drive
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 03, 2022 | 11:23 AM

Covid Vaccine Drive: కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించిన సర్కార్.. నేటి నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి ఇంటింటికీ వ్యాక్సీన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు నుంచి జులై చివరి వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు ప్రతి ఇంటికి తిరిగి, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లను గుర్తించి టీకా వేయనున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి 2 టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు టీమ్‌లలో ఒక టీమ్.. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ టీకా వేసుకోని వారిని గుర్తించి, వ్యాక్సినేషన్ క్యాంపునకు తరలిస్తుంది. ఇంకో టీమ్ గ్రామంలో ఏదో ఒక చోట క్యాంపు పెట్టి టీకా వేస్తుంది. రాష్ట్రంలో 16.36 లక్షల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు 29.51 లక్షల మంది బూస్టర్ డోసుకు అర్హత పొందారని పేర్కొన్నారు. 12 నుంచి 18 ఏళ్ల ఏజ్ గ్రూప్ పిల్లల్లో 70,827 మంది ఒక్క డోసు కూడా వేసుకోలేదని అధికారులు వెల్లడించారు.