viral video: “చిలుక కోయిల మైత్రి’ అంటే ఇదేనేమో..! ట్రాఫిక్ జామ్‌లో ఇద్దరి పిల్లల స్నేహం…

స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఇక పసివాళ్ల స్నేహానికి పేద, ధనిక అనే తారతమ్యాలు కూడా ఉండవు..అలాంటి ఘటనలు నిజ జీవితంలోనే కాదు..అనేక సినిమాల్లో తరచూ చూస్తుంటాం..పేదింటి పిల్లలతో గొప్ప వారి పిల్లలు స్నేహం చేయటం

viral video: చిలుక కోయిల మైత్రి' అంటే ఇదేనేమో..! ట్రాఫిక్ జామ్‌లో ఇద్దరి పిల్లల స్నేహం...
Friendship
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2022 | 11:09 AM

స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఇక పసివాళ్ల స్నేహానికి పేద, ధనిక అనే తారతమ్యాలు కూడా ఉండవు..అలాంటి ఘటనలు నిజ జీవితంలోనే కాదు..అనేక సినిమాల్లో తరచూ చూస్తుంటాం..పేదింటి పిల్లలతో గొప్ప వారి పిల్లలు స్నేహం చేయటం వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆగ్రహన్ని తెప్పిస్తుంది. అలాంటి సందర్భాల్లో తమ పిల్లలను పేదవారి పరిసరాల్లోకి కూడా వెళ్ల కుండా అడ్డుపడుతుంటారు. అయినప్పటికీ ఆ చిన్నారులు మాత్రం ఎలాగోలా తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. అయితే, ఇక్కడ కూడా ఓ ఇద్దరు పసిపిల్లలకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కల్లాకపటం ఎరుగని ఆ ఇద్దరు చిన్నారుల స్నేహం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..అదో రద్దీగా ఉన్న రహదారి. రోడ్డుపై సిగ్నల్‌ పడినట్టుంది. భారీగా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అంతలోనే ఓ ఆగివున్న కారు వద్దకు ఓ పేద పిల్లవాడు వెళ్తాడు. ఆ కారులో ఉన్న పిల్లవాడు.. ఆ పేద బాలుడికి ఆడుకోవడానికి తన బొమ్మలను ఇచ్చాడు. వాటిని తీసుకుని ఆ కుర్రాడు అదే రోడ్డుపై కాసేపు ఆడుకున్నాడు. కారులోని పిల్లవాడు అంతలోనే మరో బొమ్మను ఇచ్చాడు. అది కూడా ఓ సారి ట్రైచేశాడు. రోడ్డుపై నిలబడి ఉన్న పేదబాలుడు. ఇక ఆ తర్వాత.. ఆ బొమ్మలను తిరిగి ఇచ్చేస్తాడు.. కానీ కారులో ఉన్న ఆ బాలుడు వాటిని తీసుకోలేదు. కానీ ఆ వెంటనే ఆ పేద బాలుడు అక్కడ నుంచి వెళ్లి తినడానికి ఓ ప్యాకెట్‌ ఏవో స్నాక్స్‌ తీసుకొచ్చి కారులో ఉన్న కుర్రాడికి ఇస్తాడు. తర్వాత ఇద్దరు కలసి వాటిని తింటారు. కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఇక అంతలోనే ట్రాఫిక్ క్లియర్‌ అవుతుంది. అక్కడ నుంచి ఆ కారు వెళ్లిపోతుంది..దాంతో ఆ ఇద్దరు టాటా చెప్పుకుంటారు. ఇదంతా పక్కనే ఉన్న మరో కారులోంచి కొందరు వీడియో తీశారు. అనంతరం సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ అందమైన వీడియో ఇప్పటికే 2.3 లక్షల మందికిపైగా చూశారు. ఎంతోమంది లైక్ చేస్తున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?