TTD : పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారికి టీటీడీ శుభవార్త.. కళ్యాణమస్తు‌తో మంచి అవకాశం

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. పేదవారికి అండగా ఉండాలనే లక్ష్యంతో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని టీటీడీ పున:ప్రారంభించనుంది. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా

TTD : పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారికి టీటీడీ శుభవార్త.. కళ్యాణమస్తు‌తో మంచి అవకాశం
Ttd
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2022 | 8:28 AM

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. పేదవారికి అండగా ఉండాలనే లక్ష్యంతో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని టీటీడీ పున:ప్రారంభించనుంది. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కళ్యాణమస్తుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆగష్ట్ 7వ తేదిన ఏపీలోని 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాని నిర్వహించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వివరించారు. అర్హులైన పేదవారు వారి జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. నక్షత్ర యుక్త సింహలగ్నంలో ఉదయం 8 గంటల నుంచి 8:17 నిమిషాల మద్య సామూహిక వివాహాలను జరిపిస్తామన్నారు.

సామూహిక వివాహాలకు వేద పండితులు మహూర్తం నిర్ణయించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వివాహం చేసుకునే జంటలు రిజిస్ట్రేష్ చేయించుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో సీఎంలు ముందుకు వస్తే ఆ ప్రాంతాలలో కూడా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీడీ సిద్దంగా ఉందన్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కళ్యాణమస్తు వాయిదా పడుతూ వస్తోంది. 2007 పిభ్రవరి 22వ తేదిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. 6వ విడతలలో కళ్యాణమస్తూ కార్యక్రమం నిర్వహణ ద్వారా 45 వేల జంటలు ఒక్కటయ్యాయి.