AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్‌లోని ఈ పార్ట్ పోషకాల గని.. మద్యం తాగేటప్పుడు తింటే ఏమవుతుందో తెలుసా..?

మటన్ లివర్‌లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ A, విటమిన్ B12, జింక్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత నివారణ, కండరాల బలోపేతం, రోగనిరోధక శక్తి పెంపుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటంతో మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మద్యంతో కలిపి తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మటన్‌లోని ఈ పార్ట్ పోషకాల గని.. మద్యం తాగేటప్పుడు తింటే ఏమవుతుందో తెలుసా..?
Mutton Liver
Shaik Madar Saheb
|

Updated on: Jun 15, 2026 | 7:02 AM

Share

నాన్ వెజ్ ప్రియులు మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు.. అయితే.. చికెన్ మటన్ లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. చికెన్ లివర్ తో పోలిస్తే మటన్ లివర్ లో ఎక్కువ పోషకాలు దాగుంటాయి.. మటన్ లివర్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల కండరాల పెరుగుదలకు.. బలోపేతానికి ఉపయోగపడుతుంది. మటన్ లివర్ లోని అద్భుతమైన ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయని.. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయని డైటీషియన్లు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది:

మటన్ లివర్ లోని జింక్, రాగి వంటి ఖనిజాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా.. విటమిన్ బి12 నరాల బలహీనతను తగ్గిస్తుంది. అంతేకాకుండా నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.. మెదడును చురుగ్గా ఉంచుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

అయితే, మటన్ లివర్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే దీనిని తినాలి.

మద్యం తాగేటప్పుడు లివర్ తింటే…

మద్యంతో కలిపి మటన్ లివర్‌ను తీసుకోవడం కాలేయంపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిలోని అధిక కొలెస్ట్రాల్, కొవ్వులు మద్యంతో కలిసి జీర్ణక్రియను మరింత సంక్లిష్టం చేస్తాయి..

గుండెల్లో మంట, జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. కాలేయ వ్యాధులు లేదా కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు మద్యంతో కలిపి మటన్ లివర్‌ను పూర్తిగా మానుకోవాలి.

సాధారణంగా, ఎన్ని పోషకాలున్నా మటన్ లివర్‌ను మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి