AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందనంత ఎత్తులో ఉన్న నయన్, త్రిష.. కారణం అదేనా..?

అందనంత ఎత్తులో ఉన్న నయన్, త్రిష.. కారణం అదేనా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 3:59 PM

Share

కొత్త హీరోయిన్లు వరుసగా ఇండస్ట్రీలోకి వస్తున్నా, త్రిష మరియు నయనతార క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. భారీ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక్కో చిత్రానికి రూ.10 నుంచి 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. సౌత్ సినీ పరిశ్రమలో ఇప్పటికీ వీరిద్దరే అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులుగా కొనసాగుతున్నారు.

ఇండస్ట్రీకి ఎంతమంది కుర్ర భామలు క్యూ కడుతున్నా.. ఆ ఇద్దరు సీనియర్స్ రేంజ్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులోనే ఉంది. తోటి హీరోయిన్స్ అంతా రేసులో వెనుకబడుతున్నా సరే.. ఆ ఇద్దరి క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు సరికదా.. ఇంకా పెరుగుతుంది. చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతూ.. భారీ రెమ్యునరేషన్స్‌తో ప్రకంపనలు రేపుతున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా..? త్రిష, నయనతార.. ఇద్దరూ ఇద్దరే..! ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త కుర్ర హీరోయిన్లు వస్తున్నా.. వీళ్ళ స్పీడ్‌ను, వాళ్లకున్న స్టార్‌డమ్‌ కనీసం మ్యాచ్ చేయలేకపోతున్నారు. వీళ్లతో పాటే కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ చూసిన సమంత, తమన్నా, కాజల్, అనుష్క లాంటి సీనియర్లు నెమ్మదించినా.. నయనతార, త్రిష మాత్రం అస్సలు తగ్గేదే లే అంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. మన శంకరవరప్రసాద్ గారుతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న నయనతార.. ప్రస్తుతం టాక్సిక్‌, సల్మాన్ వంశీ పైడిపల్లి సినిమాలతో పాటు మూకుతి అమ్మన్2, రెక్కయ్ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఒక్కో సినిమాకు ఏకంగా 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నయన్‌కు సౌత్‌లో పోటీ ఇస్తున్న హీరోయిన్ త్రిష మాత్రమే. తమిళంలో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా కోసం వెళ్తే.. త్రిష ఏకంగా 15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసారని తెలుస్తోంది. విజయ్ గెలుపు కూడా త్రిష మార్కెట్ పెరగడంలో హెల్ప్ అయిందనే టాక్ తమిళనాట ఉంది. పైగా ఈ మధ్యే త్రిష నటించిన కరుప్పు 300 కోట్లు వసూలు చేసింది. కారణమేదైనా రెమ్యునరేషన్ విషయంలో ఇటు త్రిష, అటు నయన్ ఇద్దరూ టాప్‌లోనే ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!

ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..

Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది

Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న

Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?

Follow Us