AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beggar Lakhs : గుండెపోటుతో సాదువు మృతి..అతని గది తలుపులు తెరిచిన స్థానికులకు దిమ్మతిరిగిపోయే సీన్‌! సంచులకొద్దీ..

భిక్షాటన చేసుకుని జీవించే ఓ సాధువు గుండెపోటుతో మరణించాడు. వీధివీధిలో భిక్షాటన చేసుకుంటూ జీవించే సాధువు హఠాన్మరణంతో స్థానికులు అతని గది తలుపులు తెరిచి చూశారు. అక్కడ కనిపించిన సీన్‌ చూసి అంతా షాక్‌ అయ్యారు.

Beggar Lakhs : గుండెపోటుతో సాదువు మృతి..అతని గది తలుపులు తెరిచిన స్థానికులకు దిమ్మతిరిగిపోయే సీన్‌! సంచులకొద్దీ..
Beggar Lakhs
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2022 | 9:08 AM

Share

భిక్షాటన చేసుకుని జీవించే ఓ సాధువు గుండెపోటుతో మరణించాడు. వీధివీధిలో భిక్షాటన చేసుకుంటూ జీవించే సాధువు హఠాన్మరణంతో స్థానికులు అతని గది తలుపులు తెరిచి చూశారు. అక్కడ కనిపించిన సీన్‌ చూసి అంతా షాక్‌ అయ్యారు. ప్రతిరోజు భిక్షాటన చేసుకునే యాచకుడి ఇంట్లో కనిపించిన దృశ్యం అక్కడివారందరినీ విస్తూ పోయేలా చేసింది. దాంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైతం సాధువు ఇంట్లో కనిపించిన సంచులు చూసి అవాక్కయ్యారు..సంచుల కొద్దీ కనిపించిన నోట్ల కట్టలు చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కాకినాడ రూరల్‌ జిల్లాలోని కరప మండలం వేళంగిలో రామకృష్ణ అనే సాధువు ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ, రక్ష రేకులు కడుతూ జీవించేవాడు. స్థానిక చేపల మార్కెట్ వద్ద చిన్న గదిలో ఉండేవాడు. సమీపంలోని సత్రంలో రోజూ భోజనం చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. ఈ క్రమంలోనే సదరు యాచకుడు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాధువు రామకృష్ణ గదిలోకి వెళ్లారు. లోపల రెండు సంచులు నిండుగా కనిపించాయి. వాటిని తెరిచిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వాటినిండా కరెన్సీ నోట్లున్న పాలిథిన్ కవర్లు కనిపించాయి. వాటిలో ఎక్కువగా పది రూపాయల నోట్లు ఉన్నట్టు ఎస్సై డి.రమేశ్ బాబు తెలిపారు. ఆ సొమ్ము మొత్తం దాదాపు రూ. 2 లక్షల పైనే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడడం, చిల్లర నోట్లు కావడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో డబ్బు సంచులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు. పంచాయతీ కార్మికుల సాయంతో రామకృష్ణ మృతదేహాన్ని ఖననం చేసినట్టు చెప్పారు పోలీసులు.

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ