AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఈ చిన్న జేబు వెనక 150 ఏళ్ల మిస్టరీనా.. అసలు కథ తెలిస్తే అవాక్కే..

మీ రోజువారీ జీన్స్ ప్యాంట్‌కు ఉండే ఆ చిన్న మినీ పాకెట్ కేవలం ఒక స్టైల్ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటపడినట్లే.. మనం చిన్న వస్తువులు దాచుకోవడానికి వాడే ఆ చిన్ని జేబు వెనుక.. దాదాపు 150 ఏళ్ల చరిత్ర, ఒక పెద్ద సమస్యకు దొరికిన అద్భుతమైన పరిష్కారం దాగున్నాయి. అసలు ఆ జేబును ఎందుకు తయారుచేశారు? దాని వెనుకున్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందాం..

వార్నీ.. ఈ చిన్న జేబు వెనక 150 ఏళ్ల మిస్టరీనా.. అసలు కథ తెలిస్తే అవాక్కే..
Why Jeans Have That Small PocketImage Credit source: Getty Images
Krishna S
|

Updated on: Jul 31, 2026 | 8:43 PM

Share

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో జీన్స్ ప్యాంట్ తప్పనిసరిగా మారింది. రోజూ మనం వేసుకునే ఈ జీన్స్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. కుడి వైపు ఉన్న పెద్ద జేబుకు కొంచెం పైన ఒక చిన్న మినీ పాకెట్ కనిపిస్తుంది. చాలామంది ఇది కేవలం జీన్స్ అందాన్ని పెంచే ఒక ఫ్యాషన్ డిజైన్ అనుకుంటారు. కానీ ఆ చిన్న జేబు వెనుక దాదాపు 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత డెనిమ్ బ్రాండ్ లెవీ స్ట్రాస్, దర్జీ జాకబ్ డేవిస్ కలిసి 1873లో మొదటిసారిగా ఈ ప్రత్యేకమైన జేబును పరిచయం చేశారు. 19వ శతాబ్దంలో చేతి గడియారాలు అందుబాటులో లేని రోజుల్లో, పురుషులు పాకెట్ వాచ్‌లను వాడేవారు. ముఖ్యంగా కౌబాయ్‌లు, బంగారు గనుల కార్మికులు, రైలు డ్రైవర్లు పని చేస్తున్నప్పుడు ఈ గడియారాలను సాధారణ ప్యాంటు జేబులో పెడితే గాజు పగిలిపోవడం లేదా గీతలు పడటం జరిగేది. ఈ సమస్యకు పరిష్కారంగానే జీన్స్ పైభాగాన గడియారం సరిగ్గా సరిపోయేలా ఈ బిగుతుగా ఉండే జేబును రూపొందించారు. నాటి కుట్టుపని పత్రాల్లో దీనిని అధికారికంగా వాచ్ పాకెట్ అని పిలిచారు.

ఐదవ జేబుగా ప్రసిద్ధి..

చారిత్రక ఆధారాల ప్రకారం.. 1873 నాటి ఒరిజినల్ జీన్స్ డిజైన్‌లో మొత్తం నాలుగు జేబులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత కాలంలో వెనుక వైపు మరో జేబు రావడంతో జీన్స్ ఫైవ్ పాకెట్ డెనిమ్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న జేబే జీన్స్‌లోని ఐదవ జేబు.

మారుతున్న కాలం… మారుతున్న ఉపయోగాలు..

కాలక్రమేణా పాకెట్ వాచ్‌ల వాడకం తగ్గిపోయి చేతి గడియారాలు వచ్చినా, ఫ్యాషన్ డిజైనర్లు జీన్స్ యొక్క క్లాసిక్ లుక్ కోసం ఈ జేబును అలాగే ఉంచేశారు. కానీ డిజిటల్ యుగంలో ప్రజలు దీనిని రకరకాల పనులకు ఉపయోగిస్తున్నారు.

చిల్లర నాణేలు, టిక్కెట్లు: ప్రయాణాల్లో నాణేలు లేదా బస్సు, రైలు టిక్కెట్లు కింద పడకుండా దాచుకోవడానికి.

టెక్ గాడ్జెట్స్: పెన్ డ్రైవ్‌లు, మెమరీ కార్డ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంటి ఖరీదైన చిన్న సాంకేతిక వస్తువులు సురక్షితంగా ఉంచడానికి.

ముఖ్యమైన వస్తువులు: అత్యవసర మందులు, లైటర్లు, తాళం చెవులు లేదా ఉంగరాలు కనపడకుండా పోకుండా ఉంచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఇకపై మీరు జీన్స్ వేసుకున్నప్పుడు ఆ చిన్న జేబు కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. 150 ఏళ్ల నాటి శ్రమ, చరిత్రకు నిదర్శనమని గుర్తుంచుకోండి.

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..