laughing tree : కితకితల చెట్టు.. ముట్టుకుంటే ముప్పై వంకర్లు పోతూ నవ్వుతోంది..!

సాధారణంగా మనుషులకు చక్కిలిగింతలు, కితకితలు ఉంటాయి. అందులోనూ కొందరికి అసలే ఉండవు. కానీ చెట్లకు చక్కిలిగింతలు ఉండటం మీరేక్కడైనా చూశారా. కానీ, కొన్ని చెట్లకు చక్కిలిగింతలు అవుతాయట..

laughing tree : కితకితల చెట్టు.. ముట్టుకుంటే ముప్పై వంకర్లు పోతూ నవ్వుతోంది..!
Laughing Tree
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2022 | 9:33 AM

సాధారణంగా మనుషులకు చక్కిలిగింతలు, కితకితలు ఉంటాయి. అందులోనూ కొందరికి అసలే ఉండవు. కానీ చెట్లకు చక్కిలిగింతలు ఉండటం మీరేక్కడైనా చూశారా. కానీ, కొన్ని చెట్లకు చక్కిలిగింతలు అవుతాయట..ముట్టుకుంటే ఓ హోయలుపోతుంది. మనిషికి ఎవరో చక్కిలిగింతలు పెట్టినట్టుగా అదే పనిగా ఊగిపోతుంది. టచ్ మి నాట్ మొక్కల ఆకుల్ని మనం ముట్టుకుంటే అవి ముడుచుకుపోతాయి. అలాగే… కితకితల చెట్టును మనం నిమిరితే… అది నవ్వుతుంది. అవునండీ ఇది నిజమే..ఉత్తర భారత దేశంలో ఇలాంటి చెట్లు కనిపిస్తాయి. వాటిని స్థానికులు గుద్గుదీ (కితకితల) చెట్టు అంటారు. గాలి వచ్చినప్పుడు చెట్లు ఊగుతాయి. గాలి రాకపోతే మాత్రం అవి ఊగలేవు. వాటంతట అవి ఊగవు. అలాంటి సమయం చూసి ఈ చెట్టు కాండాన్ని నిమరాలి. అప్పుడు గాలి లేకపోయినా ఈ చెట్టు చిన్నగా కదలడాన్ని మనం గమనిచ్చవచ్చు.

ఈ భూమిపై దాదాపు 3 లక్షల కోట్లకు పైగా చెట్లు ఉన్నాయి. వాటిలో చాలా చెట్ల గురించి మనకు తెలియదు. అలాంటి వాటిల్లో ఒకటి ఈ కితకితల చెట్టు..దీని గురించి కూడా చాలా మంది తెలియదు. ఎందుకంటే..ఈ కితకితల చెట్టును మనం నిమిరితే… అది నిశబ్ధంగా నవ్వుతుందట. తనకు కితకితలు పెట్టొద్దు అన్నట్లుగా ఆ చెట్టు అటూ ఇటూ కదులుతుంది. దాని ఆకులు, కొమ్మలు చిన్నగా కదులుతాయి. అయితే, ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రండియా డ్యుమెటోరమ్ (Randia Dumetorum)గా చెబుతున్నారు శ్రాస్తవేత్తలు. ఇది చాలా సున్నితమైన చెట్టుగా పరిగణిస్తారు. దీని కాండం నుంచి సెన్సిటివ్ సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయట. అందువల్లే ముట్టుకోగానే కొమ్మలు, ఆకులూ ఊగుతాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ చెట్లు అక్కడక్కడా ఉన్నాయి.

ఇవి అంతరించిపోతున్న చెట్ల జాతుల్లో ఒక రకం.. వీటిని కాపాడాల్సిన అవసరం ఉన్నా అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలేవీ తీసుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి అరుదైన చెట్లను కాపాడాలంటూ జంతు, వృక్ష ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు.