AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: తమ్ముడు సీన్ రిపీట్.. 100 కార్లు, 100 బైకులతో అన్నదమ్ముల ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు!

సినిమాల్లో హీరోలు చేసే సాహస విన్యాసాలను చూసి మనం రోమాంచితం అవుతాం. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చేతులపై నుండి కార్లు వెళ్లే సీన్ చూసి థియేటర్లలో అందరూ నోరెళ్లబెట్టారు. సరిగ్గా అలాంటి కళ్ళు చెదిరే, ఒళ్ళు గగ్గురు పొడిచే నిజజీవిత సాహస ఘట్టాలు అనంతపురం జిల్లాలో ఆవిష్కృతమయ్యాయి. తాడిపత్రి పట్టణానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ అసాధారణ ప్రతిభతో, గుండె నిబ్బరంతో చూసే ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచారు.

Watch: తమ్ముడు సీన్ రిపీట్.. 100 కార్లు, 100 బైకులతో అన్నదమ్ముల ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు!
Lucky And Vicky Stunt
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jun 14, 2026 | 6:12 PM

Share

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్కీ, విక్కీ అనే అన్నదమ్ములు తమ అసాధారణ సాహస విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాడిపత్రి పట్టణంలోని అయాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల ఒక సాహస ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అకాడమీకి చెందిన అన్నదమ్ములు లక్కీ, విక్కీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారు నేలపై బోర్లా పడుకుని తమ చేతులను ముందుకు చాచగా, ఒకదాని వెనుక ఒకటిగా ఏకంగా 100 కార్లు వారి చేతులపై నుండి దూసుకెళ్లాయి. అంతటితో ఆగకుండా, 100 బైకులను కూడా తమ శరీరంపై నుండి ఎక్కించుకుని వెళ్తుంటే, అక్కడ గుమిగూడిన జనాల గుండెలు ఆగినంత పని అయింది. చిన్న వయసులోనే వారు ప్రదర్శించిన ఈ సాహస దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్‌గా మారాయి.

లక్కీ, విక్కీలకు ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వీరు తమ శరీరంపై 100 ట్యూబ్లైట్లను పగలగొట్టుకోవడంతో పాటు, 100 పెంకులను ఒంటిపైనే పగలగొట్టుకుని రికార్డు సృష్టించారు. ఈ అద్భుత ప్రదర్శనలకు గాను వీరు ప్రతిష్టాత్మక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ (Telugu Book of Records) లో కూడా తమ స్థానాన్ని భద్రపరుచుకున్నారు.

ఈ అన్నదమ్ముల అద్భుత విన్యాసాలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రాణాలకు తెగించి వారు చేసిన ఈ విన్యాసాలను చూసి జనం జేజేలు పలికారు. భవిష్యత్తులో వీరు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సొంతం చేసుకుని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని వారి తల్లిదండ్రులు, శిక్షకులు, స్థానికులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us