AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం ధర గ్రాముకు రూ. 30,000 దాటుతుందా? పసిడి ధరలపై నిపుణుల సంచలన అంచనాల!

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. భద్రమైన పెట్టుబడి, కుటుంబ ఆర్థిక భరోసాకు ప్రతీక కూడా. అందుకే ప్రతి చిన్న ధర మార్పు కూడా కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు చేసిన అంచనాలు బంగారం భవిష్యత్ ధరలపై చర్చకు దారితీశాయి. 2030నాటికి బంగారం ధరలు ఎలా ఉండనున్నాయో అన్నదానిపై నిపుణుల అంచనాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బంగారం ధర గ్రాముకు రూ. 30,000 దాటుతుందా? పసిడి ధరలపై నిపుణుల సంచలన అంచనాల!
Gold Price Forecast 2030
Jyothi Gadda
|

Updated on: Jul 21, 2026 | 6:55 AM

Share

భారతీయ సంస్కృతిలో బంగారానికి కేవలం ఆభరణంగానే కాకుండా ఆర్థిక భద్రత, ఐశ్వర్యానికి ప్రతీకగా విశేష స్థానం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా పసిడి ధరలు పెరుగుతున్న తీరు సామాన్యుడి బడ్జెట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ సరళిని గమనిస్తున్న ఆర్థిక నిపుణులు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాబోయే కొద్ది ఏళ్లలోనే బంగారం ధరలు రెట్టింపు కానున్నాయని, 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 3 లక్షల మార్కును అంటే గ్రాముకు రూ. 30,000 తాకవచ్చని అంచనా వేస్తున్నారు.

గ్లోబల్ బ్యాంకులు, నిపుణుల అంచనాలు:

ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ పసిడి ధరల్లో భారీ వృద్ధిని అంచనా వేసింది. అలాగే, బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా భవిష్యత్తులో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. వీటన్నింటికంటే మిన్నగా, రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్రసిద్ధ రచయిత రాబర్ట్ కియోసాకి ఒక అడుగు ముందుకు వేసి, 2035 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 10 లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సంచలన అంచనా వేశారు.

ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలు:

పరిమితమైన సరఫరా: భూమి అంతర్భాగంలో కొత్త బంగారు నిల్వలు లభించే అవకాశాలు తగ్గిపోతుండటం, మైనింగ్ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల సరఫరా పరిమితంగా మారింది.

ఇవి కూడా చదవండి

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనా, రష్యా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. డిమాండ్ పెరిగి, సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఆర్థిక, భౌగోళిక అస్థిరత: ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం కారణంగా కరెన్సీల విలువ పడిపోతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇన్వెస్టర్లకు నిపుణుల సలహా:

భవిష్యత్తులో బంగారం ఖచ్చితమైన ధర ఎంత ఉంటుందో ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేనప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడే ఏకైక నమ్మకమైన ఆస్తి బంగారమేనని చరిత్ర నిరూపించింది. ఈ దశాబ్దం ముగిసేసరికి బంగారం సామాన్య కుటుంబాల అందుబాటు పక్కన బెడితే, మధ్యతరగతికి కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల పెళ్లిళ్లు లేదా భవిష్యత్తు అవసరాల కోసం ప్లాన్ చేసుకునే వారు ఇప్పటి నుండే డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టడం సురక్షితమైన వ్యూహమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us