AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..! దసరా పండక్కి ముందే.. అకౌంట్లోకి ఆ రోజే..

పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. వచ్చే నెలలోనే రైతులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ పథకం ఎప్పటినుంచో అమలవుతుండగా.. ప్రతీ ఏడాది కేంద్రం రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది.

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..! దసరా పండక్కి ముందే.. అకౌంట్లోకి ఆ రోజే..
Pm Kisan
Venkatrao Lella
|

Updated on: Sep 27, 2026 | 2:25 PM

Share

పీఎం కిసాన్ నిధుల విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. అక్టోబర్‌లో 24వ విడత సాయాన్ని రిలీజ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో లబ్దిదారులందరి అకౌంట్లలో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి. దసరా కానుకగా వీటిని విడదుల చేయాలని ప్రభుత్వం బావిస్తోంది. దీంతో పీఎం కిసాన్ సొమ్ము కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తొలుత వినాయక చవితి సందర్బంగా అందించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా రైతుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు పండక్కి ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

అక్టోబర్ 17వ తేదీన పీఎం కిసాన్ విడుదల..!

అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ రానుండగా.. అక్టోబర్ 17న పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో పండక్కి ముందే రైతుల అకౌంట్లో డబ్బులు పడనున్నాయి. అయితే ఏపీలోని రైతులకు పీఎం కిసాన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ సొమ్ము కూడా ఒకేసారి అకౌంట్లో పడనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్ ద్వారా రూ.2 వేలు కలిపి మొత్తం ఏపీలోని రైతులకు రూ.6 వేలు ఒకేసారి అందనుంది. అయితే పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. పీఎం కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి ఆధార్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు. ఇక కామన్ సర్వీసెస్ సెంటర్లకు వెళ్లి ఆఫ్‌లైన్‌లో కంప్లీట్ చేయవచ్చు. అలాగే పీఎం కిసాన్ అకౌంట్‌తో భూమి వివరాలు మ్యాప్ అయి ఉండాలి. ఇక బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేసి ఉండాలి. ఇవన్నీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ డబ్బలుు అకౌంట్లో జమ అవుతాయి. లేకపోతే నిధులు నిలిచిపోతాయి. పీఎం కిసాన్ ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది రూ.6 వేలు అందిస్తుండగా.. వీటిని మూడు విడతలుగా పంపిణీ చేస్తోంది.

పీఎం కిసాన్ మీకు అందుతుందా..? లేదా? తెలుసుకోండిలా..

-Pmkisan.gov.in ఓపెన్ చేయాలి

-హోమ్ పేజీలో కనిపించే ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ ఎంచుకోవాలి

-ఆధార్ లేదా మొబైల్ నెంబర్, స్టేట్, జిల్లా, మండలం, గ్రామ వివరాలు ఎంటర్ చేయాలి

-మీ గ్రామ లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో.. లేదో చూసుకోండి.

Follow Us