AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : రోజుకు 7.5 లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్.. ఈ కంటెస్టెంట్ ఎవరంటే..

బిగ్ బాస్ సీజన్ 10.. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్.. అంటూ ముందు నుంచి హోస్ట్ నాగార్జున హైప్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త కొత్త ట్విస్టులు ఇస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్. తాజాగా ఓ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ విషయం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

Bigg Boss 10 Telugu : రోజుకు 7.5 లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్.. ఈ కంటెస్టెంట్ ఎవరంటే..
Bigg Boss 10 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 27, 2026 | 4:08 PM

Share

బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్‌లో ఊహించని మలుపులు, నాటకీయ పరిణామాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.ముఖ్యంగా తెలుగులో మొదటి రోజు నుంచి గొడవలతో రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచే స్ట్రాటజీలతో గేమ్ ప్లే చేస్తున్నారు కంటెస్టెంట్స్. అయితే ఇటీవల అపూర్వ, మిథిలేస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు హౌస్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ గురించి నెట్టింట చర్చ నడుస్తుంది. తాజాగా బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న కథనం ప్రకారం.. కంటెస్టెంట్ మిథిలేష్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తీరు, ఆయన అందుకున్న భారీ పారితోషికం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, టెలివిజన్ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు రోజుల్లోనే ఆయన సాధించిన ఈ సంపాదన బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యంత అరుదైన మైలురాయిగా నిలిచింది.

సాధారణంగా బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు వారు హౌస్‌లో గడిపిన వారాల చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తుంటారు. అయితే, మిథిలేష్ మాత్రం బిగ్‌బాస్ నిర్వాహకులు ఆఫర్ చేసిన క్రేజీ డీల్‌ను స్వీకరించి, కేవలం రెండు రోజులు మాత్రమే హౌస్‌లో ఉన్న మిథిలేష్ రూ. 15 లక్షల నగదుతో బయటకు వచ్చారు. ఈ లెక్కన చూస్తే, ఆయన హౌస్‌లో గడిపిన ప్రతీ రోజుకు లభించిన పారితోషికం రూ. 7.5 లక్షల కంటే ఎక్కువేనని తెలుస్తోంది. గతంలో ఎంతోమంది ప్రముఖ సెలబ్రిటీలు వారాల తరబడి హౌస్‌లో కష్టపడి సంపాదించిన మొత్తాన్ని, మిథిలేష్ కేవలం 48 గంటల్లోనే అంటే కేవలం రెండు రోజుల్లోనే దక్కించుకోవడం విశేషం.

మిథిలేష్ కామనర్ కంటెస్టెంట్ కావడంతో అతడికి వారానికి రూ.70 వేలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించారట. అంటే రెండు రోజులకు రూ.20 వేలతోపాటు.. రూ.15 లక్షలు సొంతం చేసుకున్నారు. అంటే సగటున రోజుకు రూ.7.5 లక్షలు.. మొత్తంగా రూ.7.7 లక్షలు అందుకున్నట్లే. ఇలా అనుకుంటే కేవలం రెండు రోజుల్లోనే ఇంత భారీ మొత్తంలో డబ్బులు సంపాదించిన కంటెస్టెంట్ అతడే కావడం విశేషం. అతి తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తం సాధించడం మిథిలేష్ వేసిన “మాస్టర్ ప్లాన్” అని ఆయన అభిమానులు అంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

మిథిలేష్..

Bigg Boss Mithilesh

Bigg Boss Mithilesh

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us