OTT Movie: పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఈ సినిమా కూడా సేమ్ టు సేమ్ అలాంటి కథతోనే తెరకెక్కింది. థియేటర్లలో మంచి విజయం సాధించి ఇప్పటికే ఓటీటీలో అదరగొడుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది.

మలయాళం సినిమాలకు ఇప్పుడు నేషనల్ వైడ్ క్రేజ్, ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ మాలీవుడ్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. అలా ఓటీటీ లవర్స్ కోసం ఇప్పుడు మరో మలయాళం సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అంతే రెస్పాన్స్ అందుకుంటుండగా తాజాగా మరో ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ ఇందులో కరడుగట్టిన విలన్ గా నటించడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా పుష్ప తరహాలో సాగుతుంది. అందులో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యాన్ని చూపిస్తే ఈ సినిమాలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ ను కళ్లకు కట్టినట్లు చూపించారు. కేరళ – తమిళనాడు అటవీ సరిహద్దుల్లోని ‘ఆనకుల్లి’ అనే మారుమూల గ్రామం నేపధ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆ గ్రామస్తులపై తరచూ ఏనుగులు దాడులు చేస్తుంటాయి. ఇదే క్రమంలో మారి (సునీల్) అనే ఓ వేటగాడు వచ్చి ఏనుగుల భయం నుంచి ఆ ఊరిని కాపాడతాడు. అయితే కాల క్రమేణా మారి ఆ గ్రామాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. ఆ ఊరి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి, ఏనుగు దంతాల అక్రమ రవాణాతో ఒక స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇదే క్రమంలో మారికి ఎడ్డీ అనే మరో ప్రత్యర్థి కూడా తయారవుతాడు. రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ లో అమాయక ప్రజలు బలవుతుంటారు. ఇంతలోనే గ్రామంలోని ఆంటోనీ అడుగు పెడతాడు. అమాయక ప్రజలపై జరుగుతున్న హింస, అక్రమాలను చూసి చలించిపోతాడు. తనను నమ్ముకున్న గ్రామస్తుల కోసం ఆంటోని ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ
ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు కాట్టాలన్. పాల్ జార్జ్ తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ లో ఆంటోనీ వర్గీస్ హీరోగా నటించాడు.అలాగే సునీల్, జగదీష్, దుషారా విజయన్, కబీర్ దుహాన్ సింగ్, పార్థ్ తివారీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చివరిలో స్టార్ డైరెక్టర్, డీసీ హీరో లోకేష్ కనగరాజ్ ఓ క్యామియో పాత్రలో మెరవడం విశేషం. కాటాలన్ సినిమా ఇప్పటికే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మనోరమా మ్యాక్స్ తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే తాజాగా కాటాలన్ సినిమా మరో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి కాటాలన్ ఒక ఫర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా ఈ సినిమాలో సునీల్ విలనిజం ఓ రేంజ్ లో ఉంది.
సునీల్ కాటాలన్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




