Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్!
Central Bank of India Apprentice Recruitment 2026: ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనున్నారు.

Central Bank of India Recruitment 2026: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగావకాశం లభించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,500 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు బ్యాంకు శాఖల్లో శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు వివరాలు
- పోస్టు పేరు: అప్రెంటిస్
- మొత్తం ఖాళీలు: 4,500
- ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 128
- తెలంగాణలో ఖాళీలు: 100
విద్యార్హత
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 01 జనవరి 2022 లేదా ఆ తర్వాత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో ముందుగానే నమోదు చేసుకుని ఉండటం తప్పనిసరి.
వయోపరిమితి
2026 మే 31 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ/ఎస్టీ: 5 సంవత్సరాలు
- ఓబీసీ: 3 సంవత్సరాలు
- పీడబ్ల్యూడీ: నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు.
- ఆన్‌లైన్ పరీక్ష
- స్థానిక భాషా పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్
పరీక్ష విధానం
ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలకు గంట సమయం కేటాయిస్తారు.
అంశం.. ప్రశ్నలు
- జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ | 20 |
- ఆప్టిట్యూడ్ & రీజనింగ్ | 20 |
- కంప్యూటర్ నాలెడ్జ్ | 20 |
- జనరల్ ఇంగ్లీష్ | 20 |
- సెంట్రల్ బ్యాంక్ సేవలపై అవగాహన | 20 |
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు
- నెగిటివ్ మార్కింగ్ లేదు
శిక్షణ, స్టైపెండ్
ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్ శిక్షణ అందిస్తారు. శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఉండవు.
దరఖాస్తు ఫీజు
- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ పురుషులు: రూ.944
- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ మహిళలు: రూ.708
- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు: రూ.236
ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
- అనంతరం BFSI SSC పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
- దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల ప్రారంభం: 12 జూన్ 2026
- చివరి తేదీ: 22 జూన్ 2026
- ఆన్‌లైన్ పరీక్ష: జూలై 2026 తొలి వారం
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న డిగ్రీ పూర్తి చేసిన యువతకు ఇది మంచి అవకాశం. భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో అర్హులైన అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది.
సెంట్రల్ బ్యాంక్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి




