Anand Mahindra : “భగీరథుడి ఒడిలోకి చేరుతున్న అలకనంద’..అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్‌ మహీంద్ర..నెటిజన్లు ఫిదా

ప్రకృతి పట్ల తనకున్న ప్రేమను తరచుగా వ్యక్తపరిచే ఆనంద్ మహీంద్రా తాజాగా అలకనంద నది భాగీరథి నదితో కలిసి ప్రవహించే అద్భుతమైన చిత్రాన్ని తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

Anand Mahindra : భగీరథుడి ఒడిలోకి చేరుతున్న అలకనంద'..అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్‌ మహీంద్ర..నెటిజన్లు ఫిదా
Alaknanda
Follow us
Jyothi Gadda

| Edited By: Team Veegam

Updated on: Sep 25, 2022 | 8:51 AM

ప్రకృతి పట్ల తనకున్న ప్రేమను తరచుగా వ్యక్తపరిచే ఆనంద్ మహీంద్రా తాజాగా అలకనంద నది భాగీరథి నదితో కలిసి ప్రవహించే అద్భుతమైన చిత్రాన్ని తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఫోటో, బహుశా డ్రోన్ షాట్ ద్వారా తీశారనుకుంట..ఇది ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ వద్ద అలకనంద భగీరథిలో కలుస్తున్న ఇరుకైన ప్రదేశాన్ని చూపుతోంది. ఈ ఫోటోకి ఆనంద్‌ మహీంద్ర ఓ అందమైన క్యాప్షన్‌ పెట్టారు. ఫోటోపై ‘అలకనంద’ అంటే ‘నిర్మల్’ అని రాసుకొచ్చారు.ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆనంద్‌ మహీంద్ర చేసిన ఈ ట్విట్‌ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ నిర్వహిస్తోంది కేంద్రం. ఏడాదిపాటు పలు కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ అలకనంద, భగీరథి నదుల సంగమానికి సంబంధించిన ఫోటోను అమృత్ మహోత్సవ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పిక్ ఆఫ్ ది డేగా క్యాప్షన్ ఇచ్చింది. ఇదే ఫోటోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో మరోమారు షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్ర.. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు మంత్రముగ్ధులయ్యారు. ఫోటోను నెటిజన్లు విపరీతంగా షేర్‌ చేస్తూ వైరల్‌గా మార్చేశారు. ఇంత అందమైన, అద్భుతమైన చిత్రాలను అందించిన ఫోటోగ్రాఫర్‌ని పలువురు ప్రశంసించారు. ఈ ఫోటోను ముందుగా తన ట్విట్టర్ ఖాతా TravlingBharatలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో వైరల్ అవుతోంది. చూడడానికి ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఉత్తరాఖండ్ నుండి ఉద్భవించే ప్రధాన నదులలో అలకనంద నది ఒకటి. అలకనంద-భాగీరథి రెండు నదులు దేవ ప్రయాగ (ఉత్తరాఖండ్) వద్ద కలిసి గంగానదిగా ఏర్పడుతాయి. ఇది భారతదేశంలో అతిపొడవైన నది. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించి డాఖిన్‌షా బాజ్‌పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ముఖ్యమైన తీర్థయాత్రలకు వెళ్లే యాత్రికుల కోసం ఈ పవిత్ర నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన బద్రీనాథ్ అలకనంద నది ఒడ్డునే ఉంది. ఈ ప్రదేశం చుట్టూ రెండు వైపులా నార్, నారాయణ్ అనే రెండు పర్వత శ్రేణులు, నారాయణ్ శ్రేణి వెనుక ఉన్న నీలకంఠ శిఖరం కలిగి ఉంటుంది. నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలం అత్యంత ప్రాముఖ్యత కలిగినది.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు