World record: ఈ గినియా పంది.. గిన్నిస్ రికార్డులకెక్కింది.. దీని ప్రత్యేకతలు తెలిస్తే వారెవ్వా అనాల్సిందే

30 సెకన్లలో అత్యధిక బాస్కెట్‌బాల్ స్లామ్ డంక్స్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన గినియా పిగ్ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడింది. హంగేరీకి చెందిన ఒక గినియా పంది

World record: ఈ గినియా పంది.. గిన్నిస్ రికార్డులకెక్కింది.. దీని ప్రత్యేకతలు తెలిస్తే వారెవ్వా అనాల్సిందే
Guinea Pig1
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2022 | 1:09 PM

30 సెకన్లలో అత్యధిక బాస్కెట్‌బాల్ స్లామ్ డంక్స్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన గినియా పిగ్ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయబడింది. హంగేరీకి చెందిన ఒక గినియా పంది ఇటీవల 30 సెకన్లలో అత్యధిక బాస్కెట్‌బాల్ స్లామ్ డంక్స్‌గా ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు స్లామ్ డంక్స్‌తో టైటిల్‌ను ఈ చిన్న జీవి కైవసం చేసుకుంది. గినియా పంది రికార్డు సృష్టించిన వీడియో ఇటీవల ఆన్‌లైన్‌లో షేర్ చేయబడింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట సంచలనం సృష్టించింది. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపడటం ఖాయం..

Guinea Pig

Guinea Pig

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో గినియా పిగ్‌.. తన నోటితో బంతిని తీయడం, దానిని చిన్న బాస్కెట్‌బాల్ హోప్‌లో ఉంచడం చూపిస్తుంది. ఒక పాయింట్ సాధించిన వెంటనే, అది మరొక బంతిని ఎంచుకొని గేమ్‌ కంటీన్యూ చేయడానికి తిరిగి వెళుతుంది. అలా కేవలం 30 సెకన్ల వ్యవధిలనే దాని టార్గెట్‌ను పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

ఒక రోజు క్రితం పోస్ట్‌ చేసిన ఈ వీడియోకి దాదాపు 10వేల దాక లైక్‌లు, వేల సంఖ్యలో షేర్లు సాధించింది. “హహ. బాగుంది” అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.