AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మాజీ ప్రియుడే కదా అని అర్ధనగ్న ఫోటోలు పంపింది.. డైరెక్ట్‌గా కలిసేందుకు వెళ్లగా షాక్

మాజీ ప్రియడు మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అప్పటికంటే ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే పర్సనల్​ ఫొటోలు అతడు ఆమెను పంపమని అడిగాడు. ప్రియుడే కదా అని పంపింది. కట్ చేస్తే.. స్త

Hyderabad: మాజీ ప్రియుడే కదా అని అర్ధనగ్న ఫోటోలు పంపింది.. డైరెక్ట్‌గా కలిసేందుకు వెళ్లగా షాక్
hair fall problem
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2022 | 12:56 PM

Share

Telangana: వారిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలం మనస్పర్థలు వచ్చాయి. దీంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అయితే అనూహ్యంగా కొంతకాలం తర్వాత అతడి నుంచి మళ్లీ మెసేజ్ వచ్చింది. ప్రియుడు మారిపోయి.. తనతో మళ్లీ కలిసి ప్రయాణించాలనుకుంటున్నాడేమో అని ఆమె అనుకుంది. ఇంకేముంది.. గతంలో మాదిరి చాటింగ్ చేసింది. మనసు విప్పి మాట్లాడింది. గతంలో ఉన్న పరిచయం నేపథ్యంలో… అతను కోరడంతో సెమీ న్యూడ్ ఫోటోలు పంపించింది. ఈ క్రమంలో ఓసారి కలుద్దామని అతడు రిక్వెస్ట్ చేశాడు. ఆమె ఓకే అంది. ఓరోజు ఇద్దరూ స్ట్రైయిట్‌ కలుసుకోగా, అతను మాజీ ప్రియుడు కాదని తెలుసుకొని ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆపై ఆ కేటుగాడి నుంచి ఆమెకు బ్లాక్‌మెయిలింగ్ ప్రారంభమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ శివారులోని శివరాంపల్లి( Shivaram Pally)కి చెందిన మహమ్మద్‌ మొహ్సిన్‌(22) పెయింటర్‌‌గా జీవనం సాగిస్తున్నాడు.  ఇతను ఓ మహిళకు మెసేజ్ చేసి రాజుగా పరిచయం చేసుకున్నాడు. ఆమె అతడిని తన మాజీ ప్రియుడిగా ఆమె అనుకుంది. అతనూ అలాగే యాక్టింగ్ చేశాడు. ఇద్దరూ రోజు గంటల కొద్దీ ఊసులు చెప్పుకున్నారు. కాస్త హద్దులు మీరి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే అతని కోరిక మేరకు అర్ధనగ్న ఫోటోలు పంపించింది.

అనంతరం ఓ రోజు ఇద్దరూ కలుసుకోగా.. ఆ యువకుడు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ కాదని తెలిసి స్టన్ అయ్యింది. వెంటనే తన ప్రైవేట్ ఫోటోలు డిలీట్ చేయాలని అతన్ని కోరింది. అతను డబ్బులిస్తేనే ఆ పని చేస్తానని చెప్పాడు. లేకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాగా ఆలోచించిన ఆమె షీ టీమ్‌కు కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు మొహ్సిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడు. తదుపరి చర్యల కోసం మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. అతనిపై సెక్షన్‌385, 354 ఐసీసీ, 67ఏ ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి