Hyderabad: మద్యం ప్రియులకు కిక్ ఎక్కించే న్యూస్.. ఆన్ లైన్ లో లిక్కర్ డెలివరీ.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే

ఇప్పుడంతా ఆన్ లైన్(Online) యుగమే నడుస్తోంది. మార్కెట్ కు, మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క క్లిక్ తో ఏది కావాలంటే అది క్షణాల్లో ఇంటి వద్దకే చేరిపోతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు, చెప్పులు, నిత్యావసరాలు...

Hyderabad: మద్యం ప్రియులకు కిక్ ఎక్కించే న్యూస్.. ఆన్ లైన్ లో లిక్కర్ డెలివరీ.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే
wines bandh
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 03, 2022 | 9:11 AM

ఇప్పుడంతా ఆన్ లైన్(Online) యుగమే నడుస్తోంది. మార్కెట్ కు, మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క క్లిక్ తో ఏది కావాలంటే అది క్షణాల్లో ఇంటి వద్దకే చేరిపోతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు, చెప్పులు, నిత్యావసరాలు, కూరగాయలు ఇలా ఎన్నో వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవడం సాధారణ విషయమైపోయింది. కానీ ఓ స్టార్టప్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఓ కంపెనీ మద్యం సరఫరా చేస్తోంది. ఏంటీ నమ్మలేకపోతున్నారా.. నిజమేనండి కానీ హైదరాబాద్ లో కాదండోయ్.. కోల్ కతా లో. హైదరాబాద్‌కే చెందిన ఇన్నోవెంట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్టార్టప్ కంపెనీ ‘బూజీ’ బ్రాండ్‌ పేరుతో ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. వైన్స్ షాప్ ముందు లైన్ లో నిల్చునే మద్యం ప్రియుల ఇబ్బందులు గమనించి, వైన్ డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో లిక్కరును డెలివరీ చేయడం దీని ప్రత్యేకత. ఈ సేవలు కోల్ కతాలో ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకొని ఈ సర్వీసును ప్రారంభించడం గమనార్హం.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి