Hyderabad News: హైదరాబాద్‌లో ‘అరణ్య భవనం’.. దేశంలోనే తొలిసారిగా..
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వేదిక అవనుంది. దేశంలోనే తొలిసారిగా ఏషియాలో రెండోదిగా హైదరాబాద్ నగరంలో వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్‌మెంట్ (అరణ్య భవనం) నిర్మాణం చేయనున్నారు...
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వేదిక అవనుంది. దేశంలోనే తొలిసారిగా ఏషియాలో రెండోదిగా హైదరాబాద్ నగరంలో వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్‌మెంట్ (అరణ్య భవనం) నిర్మాణం చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక భవనం నిర్మాణ పనులు హైటెక్ సిటీలో 2024లో ప్రారంభం కానున్నాయి. వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్‌మెంట్‌ను 360 డిగ్రీస్ లైఫ్ సంస్థ ప్రాజెక్టును నిర్మించనుంది. సమీపంలో మూడు ఎకరాల స్థలంలో ఈ భవనం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందులో మొత్తం 30 అంతస్తులు ఉండగా 25 నివాసాలకు మిగిలిన ఐదు ఫ్లోర్లు పార్కింగ్ కోసం కేటాయిస్తారు. ఈ అపార్ట్‌మెంట్‌లో ప్రతీ ప్లాట్‌లో ప్రతీ అంతస్తులో చెట్లు వచ్చేలా ఈ భవనాన్ని రూపొందించారు. చూడటానికి నిలువుగా విస్తరించిన అడవిలా ఈ భవనం కనిపించనుంది.
ఇందులో ప్రతీ అపార్ట్‌మెంట్‌లో బాల్కనీలో పళ్ల చెట్లు, బెడ్‌రూమ్ దగ్గర సువాసన వెదజల్లే చెట్లు, కిచెన్ దగ్గర కూరగాయల మొక్కలు వచ్చేలా భవనం నిర్మించనున్నారు. నలువైపుల నుంచి గాలి, వెలుతురు ధారళంగా వచ్చేలా చెట్లు పెరిగేందుకు అనువుగా అత్యున్నత టెక్నాలజీ వాడుతూ ఈ భవనం నిర్మించనున్నారు. ఏషియాలో చైనాలోని కివీ సిటీలో తొలి వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరిగింది. అందులో 826 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దాని తర్వాత రెండో భవంతిని హైదరాబాద్‌లో నిర్మించేందుకు ప్రయత్నాలు జోరుగా నడుస్తున్నాయి. మొత్తంగా ఈ భవంతిలో 288 ప్లాట్స్ ఉంటాయటా.