AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake documents: నాదర్ గుల్ లో నకిలీల హవా..ఖాలీ స్థలం కనిపిస్తే కబ్జానే..కానీ, కథ అడ్డం తిరిగింది..!

పట్టణం ఆక్రమణలకు అడ్డాగా మారంది. సిటీ శివారులో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఏదైనా సరే ఆక్రమించేస్తున్నారు కబ్జారాయుళ్లు. వెంచర్లు చేసి

Fake documents: నాదర్ గుల్ లో నకిలీల హవా..ఖాలీ స్థలం కనిపిస్తే కబ్జానే..కానీ, కథ అడ్డం తిరిగింది..!
Hyd
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2022 | 2:22 PM

Share

పట్టణం ఆక్రమణలకు అడ్డాగా మారంది. సిటీ శివారులో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఏదైనా సరే ఆక్రమించేస్తున్నారు కబ్జారాయుళ్లు. వెంచర్లు చేసి అమ్మేస్తున్నారు. నిర్మాణాలు కూడా కట్టేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్లాట్ ఖాళీగా కనపడితే సరి, ఇక అంతే సంగతులు. ఇక మీ ప్లాట్ ఆ ముఠా సొంతం అయినట్టే..ఆ ప్లాట్ కి సంబందించిన పూర్తి పత్రాలు నకిలీవి తయారు చేస్తారు. నకిలీ వ్యక్తులని పెట్టి కోట్ల రూపాయలకు అమ్మేస్తారు. ఇలా అధిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్ గుల్ లో 600 గజాల ప్లాట్ కి చెందిన నకిలీ డాక్యుమెంట్స్ నీ నకిలీ వ్యక్తులతో ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. వారి ప్లాన్‌ బెడిసి కొట్టడంతో చివరకు కటకటాల్లోకి వెళ్ళారు. వివరాల్లోకి వెళితే…

నదర్గుల్ సర్వే నంబర్ 71,72,73 లో ఉన్న 600 గజాల ప్లాట్ పసుపులేటి లక్ష్మి వెంకట్ వాళ్ళ గ్రాండ్ మదర్ 1986 లో కొనడం జరిగింది. చాలా రోజులు దానిని పట్టించుకోక పోవడంతో ఈ కబ్జా ముఠా కంట్లో పడింది. వెంటనే ప్రధాన నిందితుడుగా ఉన్న వ్యక్తి తన ముఠా తో కలిసి పేద వారిని టార్గెట్ గా చేసుకుని వారికి డబ్బులు ఆశ చూపి నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించి సీసీ కాపితో నకిలీ పత్రాలు సృష్టించారు. సమాన వయస్సు కలిగిన వారితో డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మేశారంటూ బాధితులు వాపోతున్నారు. వెంటనే లాండ్ పైకి పొజిషన్ కోసం వెళ్లగా అసలు బండారం బయట పడింది. దీంతో, లక్ష్మి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు,.. ముఠా లో 8మందిని అరెస్ట్ చేశారు. మరో 5 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు రాచకొండ సిపి మీడియా కి తెలిపారు…