AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎంపీ బోసు కారులో దొంగతనం.. రాజ్యసభ గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, ఏటీఎం కార్డు, అపహరణ

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కారులో దొంగతనం జరిగింది. బోసుకు చెందిన రాజ్యసభ గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, ఏటీఎం కార్డు, అపహరణకు గురయ్యాయి. ఎంపీ బోసు ఫిర్యాదుతో ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh: ఎంపీ బోసు కారులో దొంగతనం.. రాజ్యసభ గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, ఏటీఎం కార్డు, అపహరణ
Pilli Subhash Chandra Bose
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2022 | 3:44 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కారులో దొంగతనం జరిగింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రబోసుకు సంబంధించిన రాజ్యసభ గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, ఏటీఎం కార్డును గుర్తు తెలియని దుండగులు అపహరించుకువెళ్లారు. దీంతో ఆయన ద్రాక్షారామ పోలీసులకు పిర్యాదు చేశారు.

గత నెల 25వ తేదీన ద్రాక్షారామలో అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నాయకుడు కొమ్మిశెట్టి వీర్రాజు ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అదే సమయంలో కార్ డోర్స్ లాక్ చేయని కారణంగా కారులో ఉన్న పర్సు అపహరణకు గురైనట్టు ఎంపీ వ్యక్తిగత సిబ్బంది గుర్తించారు. పర్సులో రాజ్యసభ గుర్తింపు, హెల్త్, ఎటీఎం కార్డ్స్ ఉన్నాయంటూ ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు బోస్. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..