Raghuveera Reddy: పొలం పనుల్లో మాజీ మంత్రి బిజిబిజీ.. స్వయంగా పంట కోసిన రఘువీరారెడ్డి..

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం రఘువీరారెడ్డి స్వగ్రామం. ఆయన తన గ్రామంలోని వ్యవసాయ క్షత్రంలో రైతుగా మారి వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

Raghuveera Reddy: పొలం పనుల్లో మాజీ మంత్రి బిజిబిజీ.. స్వయంగా పంట కోసిన రఘువీరారెడ్డి..
Rvr
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2022 | 1:24 PM

Raghuveera Reddy: ఆయన సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ఉమ్మడి ఆంధప్రదేశ్ కు మంత్రిగా పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. కాలక్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వ్యవసాయదారుడిగా హలం పట్టి.. సామాన్యుడిలా పొలం దున్నుతున్నారు. వయసు రీత్యా వచ్చే మార్పులను సామాన్యులే అంగీకరించక మేకప్ వేసుకుంటున్న రోజుల్లో  సామాన్యుడిగా జీవిస్తున్న రాజకీయ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి కి చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం రఘువీరారెడ్డి స్వగ్రామం. ఆయన తన గ్రామంలోని వ్యవసాయ క్షత్రంలో రైతుగా మారి వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.  తాజాగా తన పొలంలో రాగి పంట కోతకు వచ్చింది. దీంతో రాగి పంటను వ్యవసాయ కూలీలతో కలిసి ఆధునిక యంత్రంతో స్వయంగా కోశారు.

విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సాధారణ పౌరుడిలా జీవనం కొనసాగిస్తూ..వ్యవసాయం చేసుకుంటున్నారు. రఘువీరారెడ్డి వేషధారణ పూర్తిగా మారిపోయింది. తెల్లటి గడ్డం, అడ్డపంచతో సామాన్యుడిలా దర్శనం ఇస్తున్నారు.  అయితే రఘువీరారెడ్డి తిరిగి రాజకీయాల్లో ఎప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..