Apple Mango: ఇక్కడ కనిపిస్తున్నది ఆపిల్‌ కాదు మ్యాంగో.. వినూత్నమైన సాగు చేపట్టిన రైతు..కేజీ ఎంతంటే

కశ్మీర్‌ ఆపిల్‌ను పోలి ఉండే ఈ మామిడి రకాన్ని ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. రెడ్‌ మ్యాంగోగా చెప్పే ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంతో సాగు చేస్తున్నానంటునంటున్నాడు రైతు వెంకటేశ్వరరావు.

Apple Mango: ఇక్కడ కనిపిస్తున్నది ఆపిల్‌ కాదు మ్యాంగో.. వినూత్నమైన సాగు చేపట్టిన రైతు..కేజీ ఎంతంటే
Apple Mango
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2022 | 3:12 PM

Prakasam District: వేసవి వచ్చిందంటే చాలు అందరి చూపు మామిడి పండువైపే.. పండ్లకు రారాజు మామిడిపడుని ఇష్టపడని పడని వారు బహు అరుదు. అయితే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో వినూత్నమైన మామిడి రకాన్ని పండిస్తున్నాడు ఓ రైతు. కేవలం జపాన్‌లో మాత్రమే పండే ఆపిల్‌ మ్యాంగో సాగును చేపట్టాడు. కశ్మీర్‌ ఆపిల్‌ను పోలి ఉండే ఈ మామిడి రకాన్ని ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. రెడ్‌ మ్యాంగోగా చెప్పే ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంతో సాగు చేస్తున్నానంటునంటున్నాడు రైతు వెంకటేశ్వరరావు. తెలంగాణలోని నర్సాపురం నుంచి ఈ మొక్కలను తీసుకొచ్చి సాగు చేస్తున్నానని తెలిపాడు. బహిరంగ మార్కెట్‌లో ఈ ఆపిల్‌ మ్యాంగో ధర కిలో ఐదొందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుందని చెబుతున్నాడు రైతు వెంకటేశ్వరరావు.

జపాన్‌ దేశానికి చెందిన ఈ మామిడి పండ్లు అచ్చం కశ్మీర్‌ ఆపిల్‌ను పోలి ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆపిల్‌ మ్యాంగో స్పెషాలీటిస్‌ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. షుగర్‌ కంటెంట్‌ తక్కువ, ఫైబర్‌ అధిక శాతం ఉంటుందని చెబుతున్నాడు రైతు వెంకటేశ్వరరావు. ఈ రెడ్ మ్యాంగ్‌ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అంటున్నాడు. అయితే, ఇది అన్ని రకాల మామిడి రకాల్లా కాకుండా ఒక్కో చెట్టుకు 25 నుంచి 30 కేజీల వరకు దిగుబడి వస్తుందని, పైగా ధర ఎక్కువగా ఉండటంతో మంచి లాభసాటిగా ఉందని చెబుతున్నాడు. ఎలాంటి కెమికల్స్‌ వినియోగించకుండా రెడ్‌ మ్యాంగో సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు రైతు వెంకటేశ్వరరావు. గోపంచకం, ఆవు పేడను ఎరువుగా మార్చి, ఆపిల్‌ మ్యాంగోను పండిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా కొత్త రకం మామిడిని పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు రైతు వెంకటేశ్వరరావు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే