CM Jagan Convoy: వారెవ్వా.. నెట్టింట వైరల్‌గా సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయన కాన్వాయ్ విజువల్స్ వైరల్ అయ్యాయి.
Andhra pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ(Delhi) వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)కు నిధుల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. 2014, జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ఏపీ, తెలంగాణగా విడిపోయిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే డేట్‌న ప్రధానితో జగన్ సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించకుంది. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా సహా.. అనేక హామీలను ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ సర్కార్. ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ అనంతరం పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు సీఎం జగన్. కాగా ఉదయం 11 గంటల సమయంలో తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు జగన్. అక్కడి నుంచి 11:30 గంటలకు ఢిల్లీ విమానం ఎక్కారు. కాగా సీఎం జగన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటున్న సమయంలో ఆయన కాన్వాయ్‌కి సంబంధించిన విజువల్స్ తీయగా.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ముఖ్యమంత్రి జగన్ ఇటీవలే దావోస్ వెళ్లి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల పాల్గొని తిరిగివచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన కొద్ది రోజులకే సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో దావోస్ పర్యటన వివరాలను సైతం కేంద్రానికి వెల్లడించే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి