Andhra Pradesh: “అధికారం లేని అధికార ప్రతినిధిగా ఉన్నా”.. టీడీపీకి దివ్యవాణి రాజీనామా

తెలుగుదేశం(TDP) పార్టీకి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దివ్యవాణి(Divyavani) పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. పార్టీలో తనకు ఎదురైన...

Andhra Pradesh: అధికారం లేని అధికార ప్రతినిధిగా ఉన్నా.. టీడీపీకి దివ్యవాణి రాజీనామా
Divyavani
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 02, 2022 | 10:41 AM

తెలుగుదేశం(TDP) పార్టీకి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దివ్యవాణి(Divyavani) పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దివ్యవాణి ఆరోపించారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేస్తున్నా గుర్తింపే లేదని ఆవేదన చెందారు. ఒక క‌ళాకారుడు స్థాపించిన పార్టీలో కళాకారులకు స్థానం లేకపోవడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు తాను అధికారం లేని అధికార ప్రతినిధిగా పార్టీలో ఉన్నానని వెల్లడించారు. మంగళవారం ఉదయం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ట్వీట్ చేశారు. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆమె ట్విట్టర్‌ వేదికగా అభిప్రాయం పంచుకున్నారు.

కాగా.. ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆమె తన రాజీనామా నిర్ణయంపై వెనక్కు తగ్గారు. రాజీనామా చేస్తున్నట్లు పోస్ట్ చేసిన ట్వీట్‌ను ట్విట్టర్ అకౌంట్ నుంచి తొలగించారు. టీడీపీ లీడర్ బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత ఆమె తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది. ఫలితంగా దివ్యవాణి టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టమైంది. ఈ సమంలో ఆమె చంద్రబాబును కలిశారు. అనంతరం పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..