Andhra Pradesh: నేడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధానితో చర్చించే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మహోన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చర్చిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్..ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మహోన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చర్చిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్..ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో హస్తినకు పయనమవుతున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం ప్రధాని(PM Modi) తో భేటీ కానున్నారు. ఏపీ రుణ పరిమితిపై కేంద్రం విధించిన సీలింగ్‌ను ఎత్తివేసే అంశాన్ని చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. కేంద్ర ఆర్థికశాఖతోపాటు కాగ్ నుంచి అభ్యంతరాలు వస్తున్నందున జగన్ ఢిల్లీ(Delhi) పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఏపీ రుణాల మొత్తం భారీగా పెరిగింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు, హామీదారుగా ఉన్న అప్పుల విషయాలను కేంద్ర హోం మంత్రికి వివరించే అవకాశం ఉంది. ఈ లెక్కలపై పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని కాగ్, ఆర్థికశాఖలు తరచూ రాష్ట్రానికి లేఖలు రాస్తున్నాయి. ఈ అంశాలన్నీ ప్రధానికి వివరించి రుణ పరిమితి సీలింగ్‌పై వెసులుబాటు ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ కోరే అవకాశం ఉంది. అంతే కాకుండా రాష్ట్రపతి ఎన్నికల విషయంపై కూడా ప్రధాని మోదీ-ముఖ్యమంత్రి జగన్‌ల మధ్య చర్చ జరగనున్నట్టు తెసుస్తోంది.
ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ గన్నవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు 1- జన్‌పథ్ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి