AP News: గుంటూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. తల్లీకూతుళ్లపై బ్లేడ్‌తో దాడి.. ఆ తర్వాత..

పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే గీత ఇంటికి ధర్మతేజ వెళ్లాడడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ధర్మతేజ గుంటూరు (Guntur) లోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

AP News: గుంటూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. తల్లీకూతుళ్లపై బ్లేడ్‌తో దాడి.. ఆ తర్వాత..
Guntur
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 01, 2022 | 7:30 PM

Lover Attack On Young Girl: గుంటూరులో యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ప్రేమపేరుతో యువతి వేధిస్తున్న ఓ యువకుడు ఉన్మాదిగా మారి.. ఇంట్లోకి చొరబడి బ్లేడ్‌తో యువతిపై దాడికి తెగబడ్డాడు. అడ్డుకోడానికి ప్రయత్నించిన ఆమె తల్లిపైనా దాడిచేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ధర్మతేజ, గీత గతంలో ప్రేమించుకున్నారని బంధువులు చెబుతున్నారు. గీత కూడా ధర్మతేజ కోసం ఆత్మహత్యాయత్నం చేసిందంటున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే గీత ఇంటికి ధర్మతేజ వెళ్లాడడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ధర్మతేజ గుంటూరు (Guntur) లోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ధర్మతేజ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు పోలీసులు. అంతకుముందు గుంటూరులోని కృష్ణానగర్‌ పీఎఫ్‌ ఆఫీస్‌ దగ్గర ఉన్న అమ్మాయి ఇంట్లో దాడికి తెగబడ్డాడు ధర్మతేజ. తల్లీకూతుళ్లపై ఎటాక్‌ చేశాడు. తనను ప్రేమించిన అమ్మాయి మాట వినడం లేదని దాడికి పాల్పడ్డాడు.దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడో సైకో అంటూ మండిపడ్డారు.

కాగా.. ధర్మతేజ దాడిలో గాయపడిన యువతికి, ఆమె తల్లికి మరో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది. ధర్మతేజది తెనాలి. ఇంజినీరింగ్‌ చదివాడు. ఓ ప్రముఖ ఎడ్యుకేర్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేసేవాడు. విశాఖలో జాబ్‌ చేసే ధర్మతేజ.. యువతి ఇంటికివెళ్లాడు. ఆమె తండ్రి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లే దాక వెయిట్‌ చేశాడు.అతను అలా వెళ్లగానే డైరెక్ట్‌గా ఇంట్లోకి ఎంటరయ్యాడు. ఎవరంటూ యువతి తల్లి అడ్డుకోబోయింది. ఆమెపై దాడికి దిగాడు ధర్మతేజా. అలికిడి విని యువతి, ఆమె సోదరి బయటకు వచ్చారు. అంతే ఆ యువతిపై అటాక్‌ చేశాడు. ఇదంతా నిమిషాల్లో జరిగిపోయింది.

ఇవి కూడా చదవండి