Hyderabad: నానక్ రాంగూడలో అగ్ని ప్రమాదం.. అర్థరాత్రి ఉలిక్కిపడ్డ నగరవాసులు
హైదరాబాద్(Hyderabad) లో వరస అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం రాయదుర్గం(Rayadurgam) గ్రీన్ బావర్చిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరవకముందే మరో ఘటన జరగడంతో నగరవాసులు....
హైదరాబాద్(Hyderabad) లో వరస అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం రాయదుర్గం(Rayadurgam) గ్రీన్ బావర్చిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరవకముందే మరో ఘటన జరగడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్ రాంగూడ మంత్రి సెలెస్టియా టవర్స్‌లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మంత్రి సెలెస్టియా టవర్స్ బి-బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎలక్ట్రికల్ కేబుల్ రూమ్ లోని పవర్ స్టేషన్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి దట్టమైన పొగలు అలముకున్నాయి. సకాలంలో ఫైర్ బెల్స్ మోగడంతో అపార్ట్మెంట్ వాసులు క్రిందకి దిగి వచ్చేయడంతో ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాద స్థాయిని తగ్గించామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. సకాలంలో అందరూ స్పందించడంతో ప్రమాదం నుంచి అందరూ బయట పడ్డామని అపార్ట్మెంట్ వాసులు చెప్పారు. ఊహించని ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు.
రాయదుర్గంలోని గ్రీన్‌బవార్చి హోటల్ రెండో అంతస్తులో ఐదు రోజుల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. మంటల ధాటికి భవనమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వారిని సురక్షితంగా బయటకు తీశారు. బిల్డింగ్ లో ఒక్కసారిగా మంటలు చలరేగటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి