Telangana Formation Day 2022 Live: గల్లీ టు ఢిల్లీ ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

| Edited By: Anil kumar poka

Updated on: Jun 07, 2022 | 3:43 PM

Telangana Formation Day Ceremony Live Updates: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాసేపట్లో మొదలు కానున్నాయి. సీఎం కేసీఆర్ కాసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Telangana Formation Day 2022 Live: గల్లీ టు ఢిల్లీ ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
Telangana Formation Day

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాసేపట్లో మొదలు కానున్నాయి. సీఎం కేసీఆర్ కాసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం దేశ రాజధానిలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన తెలిపింది. ఈ కార్యక్రమంలో షాతో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి, విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా పాల్గొంటారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Jun 2022 01:28 PM (IST)

    ఏ రాష్ట్రం సాధించని విజయాలు తెలంగాణ సొంతం.. అభివృద్ధిలో శిఖరాగ్రాన రాష్ట్రం..

    Cm Kcr Speech

    Cm Kcr Speech

    ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించి చూపిందన్నారు. అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు.

  • 02 Jun 2022 12:17 PM (IST)

    జిల్లాల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతోంది ప్రభుత్వం. జిల్లా కేంద్రాల్లో ఇంచార్జ్ మంత్రులు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు.

  • 02 Jun 2022 12:15 PM (IST)

    దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్..

    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

  • 02 Jun 2022 10:48 AM (IST)

    తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్..

    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందని చెప్పారు.

  • 02 Jun 2022 10:43 AM (IST)

    జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

    జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అమర వీరులకు నివాళులర్పించారు.

    Ghmc

    Ghmc

  • 02 Jun 2022 10:18 AM (IST)

    తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు విషెష్ చెబుతూ ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలు కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో ముందుంటారు. తెలంగాణా రాష్ట్ర సంస్కృతి ప్రపంచ ప్రఖ్యాతి పొందింది . తెలంగాణా ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలి.’ అని పేర్కొన్నారు.

  • 02 Jun 2022 10:11 AM (IST)

    తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

    భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాష్ట్రపతి.. ‘సుసంపన్నమైన సంస్కృతి, చరిత్ర కలిగిన తెలంగాణ అభివృద్ధి సూచికలలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. పరిశ్రమలకు కేంద్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ నిరంతరం అభివృద్ధి చెందాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.

  • 02 Jun 2022 09:07 AM (IST)

    పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..

    పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుత గన్ పార్క్‌ వద్ద అమరులకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తరువాత పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

  • 02 Jun 2022 09:05 AM (IST)

    రాజ్‌భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

    రాజ్‌భవన్‌లోను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. పలు రంగాల్లో రాణిస్తున్న వారికి పురస్కారాలు అందజేశారు.

  • 02 Jun 2022 08:57 AM (IST)

    పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అమరులకు నివాళులర్పించారు. 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

  • 02 Jun 2022 08:51 AM (IST)

    గాంధీ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

    హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. వి హనుమంతరావు, జగ్గారెడ్డి సహా ముఖ్య నేతలు ఆ సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. జగ్గారెడ్డి, వీహెచ్ డోలు వాయిస్తూ డ్యాన్స్ చేశారు.

  • 02 Jun 2022 08:47 AM (IST)

    బీఆర్‌కే భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకావిష్కరణ చేసిన సీఎస్..

    రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ కేఆర్ భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • 02 Jun 2022 08:44 AM (IST)

    గల్లీ టు ఢిల్లీ.. ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు..

    తెలంగాణలోని గల్లీల నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు.

  • 02 Jun 2022 08:41 AM (IST)

    యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు..

    తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమయ్యారని అన్నారు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరులు, వారి కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుకుందాం అని అన్నారు.

    ‘మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుండి పుట్టింది తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ప్రజల వాణిని విని తెలంగాణ కలను సాకారం చేసేందుకు నిస్వార్థంగా పనిచేసినందుకు గర్విస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. గత 8 ఎళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో దారుణమైన పాలనను చవిచూసిందని విమర్శించారు. ‘‘#TelanganaFormationDay నాడు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు & సామాన్య ప్రజలకు శ్రేయస్సు తీసుకురావడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా, ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ నిబద్ధతను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను’’ అని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • 02 Jun 2022 08:32 AM (IST)

    తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: మానిక్కం ఠాగూర్

    తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మానిక్కం ఠాగూర్. గాంధీ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఎగురవేశారు. అమరవీరులకు నివాళులర్పించారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ అందించిన కృషిని మనం గుర్తుచేసుకుంటున్నాం. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఆమె మాటను నిలబెట్టుకుంది. ప్రజల పోరాటం గెలవడానికి సహాయం చేసింది. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీభవన్‌లో వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు మానిక్కం ఠాగూర్. అలాగే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చరిత్రను మరచిపోవద్దని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించి కాంగ్రెస్ హోంమంత్రి చిదంబరం అని గుర్తు చేసిన ఆయ.. నాడు అమిత్ షా హత్య కేసులో జైల్లో ఊచలు లెక్కిస్తున్నారని వ్యాఖ్యానించారు.

  • 02 Jun 2022 08:00 AM (IST)

    తెలంగాణలో న్యాయ చరిత్రలో సరికొత్త శకం.. నేడు 23 జిల్లాల కోర్టులు ప్రారంభం..

    తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో 23 డిస్ట్రిక్ కోర్టులను ఇవాళ ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ సంయుక్తంగా ఈ కొత్త జిల్లాల కోర్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి ఉన్న 10 జిల్లాలకు 10 కోర్టులు ఉండగా.. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కొత్త కోర్టుల నిర్మాణం చేపట్టి, ఇవాళ ప్రారంభిస్తున్నారు.

  • 02 Jun 2022 07:53 AM (IST)

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: రేవంత్‌రెడ్డి

    రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. సోనియాగాంధీ చొరవతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు.

  • 02 Jun 2022 07:45 AM (IST)

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌

    తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్. తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్రాత్మక ఘట్టం అని, ప్రజలంతా ముక్తకంఠంతో కోరి సాధించుకున్న ఒక అపురూప విజయం అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన వీరులకు వందనాలు తెలిపారు పవన్. అణచివేత, దాష్టికాలను ఎదిరించే లక్షణం తెలంగాణ సొంతం అని, పోరాడితేనే లక్ష్యం సిద్ధిస్తుందని ఎలుగెత్తి చాటింది తెలంగాణ ఉద్యమం అని అన్నారు.

  • 02 Jun 2022 07:39 AM (IST)

    తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై..

    గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఉత్సాహంతో, గర్వంతో చేసుకునే వేడుకగా అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు.

  • 02 Jun 2022 07:34 AM (IST)

    ఎనిమిదేళ్ల తరువాత కేంద్రానికి తెలంగాణ గుర్తుకు రావడం సంతోషం..

    ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం కేంద్ర ప్రభుత్వానికి గుర్తుకు రావడం సంతోషకరమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే, ఇవాళ ఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. విభజనచట్టంలోని హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

  • 02 Jun 2022 07:33 AM (IST)

    అసెంబ్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శాసనసభలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అనంతరం, అసెంబ్లీ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

  • 02 Jun 2022 07:03 AM (IST)

    ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో నిర్మించుకున్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదన్నారు.

  • 02 Jun 2022 06:45 AM (IST)

    ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి.

    తెలంగాణ రాష్ట్ర తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. శాసన మండలి ప్రాగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ శుభ సందర్భంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంsగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • 02 Jun 2022 06:35 AM (IST)

    కాసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్‌

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కాసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించునున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Published On - Jun 02,2022 6:31 AM

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..