Viral Video: నిద్రపోతుండగా బెడ్‌పైకి వచ్చిన భారీ పైథాన్లు.. వీడియో చూడాలంటే గట్స్ ఉండాల్సిందే..
కొందరికి జంతువులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రమాదకరమైన మొసలి అయినా, కొండచిలువ అయినా వాటని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు.
Pythons Viral Video: పాములను చూస్తేనే సాధారణంగా చాలామంది భయంతో పరుగులు తీస్తుంటారు.. అదే దగ్గరగా చూస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రెండు భారీ పైథాన్‌లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా వామ్మో అంటూ భయపడిపోతున్నారు. అయితే.. కొందరికి జంతువులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రమాదకరమైన మొసలి అయినా, కొండచిలువ అయినా వాటని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఈ జంతువులను వారు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ప్రస్తుతం అలాంటి జంతు ప్రేమికుడి వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి వీడియోలో ఒక వ్యక్తి హాయిగా నిద్రపోతుండగా.. అతని దగ్గరకు రెండు కొండచిలువలు వస్తాయి. అయితే.. ఆ వ్యక్తి శరీరంపై పాకుతున్న ఈ పాములు.. ఎటువంటి హాని కలిగించవు. అయితే.. పైథాన్లు పెంపుడు జంతువులుగా పేర్కొంటున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి మంచం మీద హాయిగా పడుకోని ఉండటాన్ని చూడవచ్చు. అతని దగ్గరకు రెండు భారీ కొండచిలువలు వస్తాయి. ఆ తర్వాత అతని శరీరంపై పాకుతూ కనిపించాయి. ఈ దృశ్యం వాస్తవానికి భయంకరంగా ఉంది. అయితే.. ఈ భారీ కొండచిలువలకు ఆ వ్యక్తి అస్సలు భయపడలేదు. అతను కళ్లు మూసుకొని ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
వీడియో చూడండి
View this post on Instagram
ఈ భయంకరమైన వీడియోను snakebytestv అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించారు. ఈ వీడియోను ఇప్పటివరకు 24 వేల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తుంటేనే భయం వేస్తుందని.. ఇలాంటి జీవులకు దూరంగా ఉండటమే మంచిదని పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..