JNTUH: విద్యార్థులందరికీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌.. జేఎన్‌టీయూహెచ్ కీలక నిర్ణయం..

వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సిస్టమ్ స్క్రిప్టింగ్, డేటాబేస్ సిస్టమ్ కనెక్టివిటీ, డేటా హ్యాండిల్, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ లాంటి వాటి కోసం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తారు.

JNTUH: విద్యార్థులందరికీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌.. జేఎన్‌టీయూహెచ్ కీలక నిర్ణయం..
Jntuh
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 01, 2022 | 2:27 PM

JNTU-Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఐటీ ఉద్యోగాల డిమాండ్‌తో హైదరాబాద్ జెఎన్‌టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అకాడమిక్ సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ (Python programming language) ను బోధించేలా తప్పనిసరి చేసింది. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఏ కాకుండా కాలేజ్‌లోని ప్రతి విద్యార్థికి ఈ పైథాన్ లాంగ్వేజ్‌ని తప్పనిసరి బోధించాలని.. జేఎన్‌టీయూహెచ్ ఆదేశించింది. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక ప్రముఖ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.. వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సిస్టమ్ స్క్రిప్టింగ్, డేటాబేస్ సిస్టమ్ కనెక్టివిటీ, డేటా హ్యాండిల్, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ లాంటి వాటి కోసం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తారు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కు డిమాండ్ పెరుగుతున్నందున, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నీ ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని తప్పనిసరి చేసింది.

అన్ని ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు ఈ పైథాన్ లాంగ్వేజ్ కచ్చితంగా అవసరం. ఎందుకంటే విద్యార్థులకు ఉద్యోగం సంపాదించడంలో ఈ పైథాన్ లాంగ్వేజ్ సహాయపడుతుంది. దీంతోపాటు ఉపాధి నైపుణ్యాలును పొందడంలోనూ ఇది సహాకరిస్తుంది. తాజాగా జే.ఎన్.టి.యూ.హెచ్‌లో జరిగిన బోర్డు మీటింగ్‌లో యూజీ, పీజీ సిలబస్‌లో ఈ ప్రోగ్రాం లాంగ్వేజ్‌ను చేర్చాలని యూనివర్సిటీ నిర్ణయించింది.

ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రస్తుతం యూనివర్సిటీలో ఎలక్టివ్‌గా అందుబాటులో ఉంది. కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నిపుణులకు బయట అధిక డిమాండ్ ఉంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేకుండా విద్యార్థులందరూ నేర్చుకోవలని సూచించింది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడున్న ఎలక్ట్రికల్స్ కోర్సులు పక్కనపెడితే జేఎన్టీయూహెచ్‌లో కొత్త కోర్సులలో 3D ప్రింటింగ్, ఏ.ఐ, ఆటోమేషన్ & రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులను స్టార్ట్ చేస్తున్నారు. దీంతో.. విద్యార్థులు డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేకుండా ఈ కోర్సులలో ఏదైనా కోర్సును సెలెక్ట్ చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు.

-విధయ్, టీవీ9 తెలుగు ప్రతినిధి, హైదరాబాద్

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?