BJP: మూడు రోజులు హైదరాబాద్‌లోనే ప్రధాని మోదీ, అమిత్‌ షా.. తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా బీజేపీ..

BJP National Executive Meet: తెలంగాణపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ. హైకమాండ్‌ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే... అయితే హిట్‌ లేదంటే ఫట్‌ అని డిసైడైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాషాయపార్టీ కొత్త జర్నీ మొదలెట్టింది.

BJP: మూడు రోజులు హైదరాబాద్‌లోనే ప్రధాని మోదీ, అమిత్‌ షా.. తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా బీజేపీ..
Pm Modi And Amit Shah
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 01, 2022 | 2:11 PM

తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తెలంగాణపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ(BJP). హైకమాండ్‌ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే… అయితే హిట్‌ లేదంటే ఫట్‌ అని డిసైడైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాషాయపార్టీ కొత్త జర్నీ మొదలెట్టింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతుండటంతో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణలో పర్యటించడంతో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. జులై 3 వ వారంలో 15వ తేదీ తర్వాత ఈ సమావేశాలు ఉండవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కూడా పాల్గొంటారు. మూడు రోజుల పాటు ప్రధాని మోదీ, అమిత్ షా హైదరాబాద్‌లోనే మకాం వేస్తుండటంతో మరింత హీట్ పెరుగుతోంది. 300 నుంచి 500 మంది వరకూ బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశాలకు హాజరౌతారని భావిస్తున్నారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశాలు జరగవచ్చని తెలుస్తోంది. తాజ్‌కృష్ణాను కూడా బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీజేపీ నేతలు తరుణ్‌చుగ్, బీఎల్ సంతోష్ సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని తెలిసింది.

మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించునునారు. ఇందులో భాగంగా బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.ఎల్‌. సంతోష్‌ నగరానికి బుధవారం చేరుకున్నారు. కాగా, మూడు రోజల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం