AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు కుక్కను అనాధగా విడిచిపెట్టిన యజమాని..బేబీ గర్ల్ కోసం కన్నీటి లేఖ..! కారణం తెలిస్తే కన్నీళ్లే..

పేదరికం, అనారోగ్య సమస్యల కారణంగా కొందరు తమ పిల్లల్ని, అయినవారిని అనాథలుగా విడిచిపెట్టే ఘటనలు అప్పుడప్పుడూ చూస్తుంటా..కానీ, ఓ చోట ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను

పెంపుడు కుక్కను అనాధగా విడిచిపెట్టిన యజమాని..బేబీ గర్ల్ కోసం కన్నీటి లేఖ..! కారణం తెలిస్తే కన్నీళ్లే..
Abandoned Dog
Jyothi Gadda
|

Updated on: Jun 01, 2022 | 2:11 PM

Share

పేదరికం, అనారోగ్య సమస్యల కారణంగా కొందరు తమ పిల్లల్ని, అయినవారిని అనాథలుగా విడిచిపెట్టే ఘటనలు అప్పుడప్పుడూ చూస్తుంటా..కానీ, ఓ చోట ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తననుంచి దూరంగా పంపించాలనుకున్నాడు. అందుకోసం దానికి ఓ ప్లాన్‌ చేశాడు. కుక్కను ఓ భద్రమైన ప్రాంతంలో ఉంచి, దాని పక్కనే అవసరమైన వస్తువులతో ఓ బ్యాగును పెట్టాడు. పక్కనే ఓ లేటర్‌ కూడా రాసి ఉంచాడు. అది చూసిన యానిమల్‌ చారిటీ వారు చలించిపోయారు. ఆ కుక్కను తీసుకెళ్లి తమ ట్రస్ట్‌లోనే పెట్టారు. ఇంతకీ ఆ లేటర్‌లో ఏముంది..? ఎందుకు ఆ కుక్క యజమాని దాన్ని వదిలించుకోవాలనుకున్నాడు.

పాపం యజమాని పక్కన లేకపోవటంతో బిక్కుబిక్కుమంటూ చూస్తుంది ఇక్కడో పెంపుడు కుక్క. దీని పేరు బేబీ గర్ల్‌..దాని యజమాని దీనికి ఎంతో ముద్దుగా పెట్టుకన్న పేరు ఇది. అయితే, బేబీ గర్ల్‌ డాగ్‌ని ఇలా విడిచిపెట్టడానికి ఓ బలమైన కారణం చెబుతున్నాడు యజమాని. బేబీ గర్ల్‌కి కెనైన్‌ డయాబెటిస్‌ (డయాబెటిస్‌ మిల్లిటస్‌) అనే వ్యాధి ఉందని గుర్తించారు. ఆ వ్యాధి చికిత్స కోసం నెలనెలా కుక్కకు ఇన్సులిన్‌ను, మరిన్ని రకాల మందులూ కొనాల్సి ఉంటుందట. ప్రత్యేకమైన తిండిని పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ప్రతి నెలా రూ. వేలల్లోనే ఖర్చవుతుందట. అయితే, పాపం బేబీ గర్ల్‌ యజమాని సైతం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అతడు లేఖలో ప్రస్తావించాడు. కుక్కను వదిలించుకోవటం తనకు ఎంతో బాధాకరమైన విషయమే అయినప్పటికీ తప్పటంలేదని చెప్పుకొచ్చాడు.  అయితే, చివరకు కుక్కను చారిటీ వారు తీసుకెళ్లారని తెలుసుకుని సంతోషపడ్డాడట. కాగా, ఈ ఫోటో, కుక్కకు సంబంధించిన వ్యాధి గురించి తెలుసుకున్న నెట్టిజన్లు సైతం చలించిపోయారు.

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ