AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒక్క అడుగు అతడికి ప్రాణం పోసింది..లేదంటే ఏం జరిగేదో..ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఇదేదో సినిమా డైలాగ్ అనుకునేరు..కాదు కాదు, ఒక్కో సారి జరిగే చిన్న చిన్న ప్రమాదాలే ప్రాణాలు హరించివేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..కొన్ని ఊహించిన ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అలాగే

Viral Video: ఒక్క అడుగు అతడికి ప్రాణం పోసింది..లేదంటే ఏం జరిగేదో..ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Truck
Jyothi Gadda
|

Updated on: Jun 01, 2022 | 1:46 PM

Share

ఇదేదో సినిమా డైలాగ్ అనుకునేరు..కాదు కాదు, ఒక్కో సారి జరిగే చిన్న చిన్న ప్రమాదాలే ప్రాణాలు హరించివేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..కొన్ని ఊహించిన ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అలాగే కొన్నిసార్లు ఘోరమైన ప్రమాదాలు జరిగినా.. దెబ్బలేమీ లేకుండా బయటపడుతుంటారు కొందరు. అలాంటప్పుడు.. ఆ మనిషికి ఇంకా భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయ్, లేదంటే అలా ఎలా బతికి బయటపడతారండీ…అనుకుంటుంటాం..సరిగ్గా అలాంటి షాకింగ్‌ ఘటనే ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

వైరల్‌గా మారిన ఈ వీడియోలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఒళ్లు గగ్గుర్పొడిచే ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. అతడు జాగ్రత్తగా రోడ్డుకు ఓ సైడ్‌ నుంచే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే అతని వెనకాలే ఓ వాహనం మృత్యువాహనంలా దూసుకొచ్చింది. కానీ, అతడు కాస్త గ్యాప్‌లో తప్పించుకున్నాడు. ఆ వీడియో చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది. గురుడికి ఈ భూమ్మీద ఇంకా నూకలున్నట్టున్నాయ్‌..లేదంటే, అలా ఎలా తప్పించుకోగలడు..అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. రోడ్డు పక్కన చేతిలో హెల్మెట్‌, కొన్ని పత్రాలతో నిలబడి ఉన్నాడు సదరు వ్యక్తి..అటుగా వస్తున్న ఓ ట్రక్కు చెట్టు కొమ్మలకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఎగిరిపడింది. వేగంగా కుడివైపునకు దూసుకెళ్లింది. అమాంతం పైకిలేచి ఫుట్‌పాత్‌మీదుగా పరుగులు పెట్టింది. అక్కడే ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇక నా పని ఖతమ్‌ అనుకున్నాడు..భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశాడు..

ఇవి కూడా చదవండి

ఆ ఒక్క అడుగే అతడి ప్రాణం నిలబెట్టింది. అతన్ని సమీపించిన ట్రక్కు ముందుభాగం అతన్ని తాకుతూ వెళ్లింది. ఆ దెబ్బతో అతను గోడవైపునకు మరింత కదిలాడు. అతన్ని రాసుకుంటూ వెళ్లిన ట్రక్కు అడుగుల దూరంలో ఆగిపోయింది.  అతను గోడ, ట్రక్కు మధ్యగా ఇరుక్కుపోయి బయటపడటం చూసిన ప్రతిఒక్కరూ షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అదృష్టం బాగుంది., ఇద్దరు బతికి బయటపడ్డారు.  56 సెకండ్లు ఉన్న ఈ వీడియోకు నెటిజన్ల నుండి విశేష స్పందన లభిస్తోంది.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!