Shocking video బాబోయ్, మనిషిని వేటాడిన కంగారు..సుమారు 6నిమిషాల పాటు ఆగని పోరు..షాకింగ్ వీడియో
కంగారూ పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వ్యక్తిపై దాడి చేసింది. అతడు దాన్నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం భీకరంగా కనిపించింది. కంగారు అతడు దాదాపు 6 నిమిషాలకు పైగా వీరోచితంగా పోరాటం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో
కంగారూ పరిగెత్తుకుంటూ వచ్చి ఓ వ్యక్తిపై దాడి చేసింది. అతడు దాన్నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం భీకరంగా కనిపించింది. కంగారు అతడు దాదాపు 6 నిమిషాలకు పైగా వీరోచితంగా పోరాటం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలు చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఆ వ్యక్తి కాంగారూ దాడి నుంచి ఎలా తప్పించుకున్నాడు. అసలేం జరిగిందనే దానిపై పూర్తి వివరాల్లోకి వెళితే..
సెంట్రల్ విక్టోరియాలో ఆరు నిమిషాలకు పైగా ఓ వ్యక్తి కంగారుతో యుద్ధం చేశాడు. హీత్‌కోట్ ప్రాంతానికి చెందిన క్లిఫ్ డెస్ అనే వ్యక్తి తన పెరట్లో కుక్కలు గట్టిగట్టిగా అరవటం విన్నాడు. వెంటనే ఏం జరిగి ఉంటుందని అటుగా వెళ్లి చూశాడు..అంతలోనే వారి పెరట్లోంచి ఓ పెద్ద జంతువు తనపైకి పరిగెత్తుకొస్తున్నట్టుగా గమనించాడు..వెంటనే అప్రమత్తమై పారిపోయే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఆ జంతువు రానేవచ్చింది. అది మరెదో కాదు..ఆరు అడుగులకు మించి వున్న ఓ పెద్ద కంగారు. అది క్లిఫ్ పై దాడి చేసింది. కంగారు దాడి నుంచి తప్పించుకునేందుకు అతడు అన్ని విధాలా ప్రయత్నించాడు. పలుమార్లు నేలపై పడిపోతూ దెబ్బలు తిన్నాడు. అయినా ఏ మాత్రం భయపడకుండా దాన్ని ఎదిరించే ప్రయత్నం చేశాడు. కానీ, కంగారు కూడా వెనక్కి తగ్గలేదు. అతడు కిందపడి లేచి పరిగెత్తుతున్నా కూడా వెంటపడి దాడి చేసింది. అది ఒళ్లంతా గాయపర్చింది. కంగారు దాడిలో అతడు నేలకు ముఖాన్ని వాల్చి కాసేపు అలాగే ఉండిపోయాడు. దాంతో అది అతడి చేతి వేలిని కొరికేసింది. కాళ్లపై బలంగా తొక్కింది. అతడి ఒంటిపై బట్టలు చిరిగిపోయేలా దాడిచేసింది. డెస్ మళ్లీ లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అది అతని కారు చుట్టూ అతనిని వెంబడించింది..ఇలా సుమారు ఆరు నిమిషాల 22 సెకన్ల పాటు ఈ ఇద్దరి మధ్య భీకర యుద్ధం నడిచింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కంగారులు కూడా విపరీతంగా దాడి చేసే ప్రయాదం ఉన్నందున్న ప్రజలు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.