Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: స్వాతంత్య్రానికి ముందు నుండి ఓటు వేస్తున్న వృద్ధురాలు..కలర్‌ బాక్స్‌ నుండి ఈవీఎంల వరకు..

త్రిక్కకర నియోజకవర్గంలో ఓటు వేయటానికి అతి వృద్ధ మహిళ ఒకరు పోలింగ్‌ బూత్‌కు వచ్చారు. త్రిక్కకర నియోజకవర్గంలో 100ఏళ్లు పై బడిన 22 మంది ఓటర్లలో ఆమె కూడా ఒకరు.

Kerala: స్వాతంత్య్రానికి ముందు నుండి ఓటు వేస్తున్న వృద్ధురాలు..కలర్‌ బాక్స్‌ నుండి ఈవీఎంల వరకు..
Thrikkakara Bypoll
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 01, 2022 | 10:26 AM

ఉత్తరాఖండ్, కేరళ, ఒడిషా రాష్ట్రాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు ఆయా రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నిక‌ల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో ప‌లువురు అగ్ర నేత‌లు పోటీలో ఉన్నారు. కాబ‌ట్టి ఈ ఎన్నిక‌ల‌పై దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెలకొంది. ఈ క్రమంలోనే కేర‌ళ వాణిజ్య రాజధాని కొచ్చిలోని త్రిక్కకర నియోజకవర్గంలో పోలింగ్‌ కొనసాగుతోంది. 239 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే, ఇక్కడ ఓ ఆసక్తి ఘటన చోటు చేసుకుంది. త్రిక్కకర నియోజకవర్గంలో ఓటు వేయటానికి అతి వృద్ధ మహిళ ఒకరు పోలింగ్‌ బూత్‌కు వచ్చారు. త్రిక్కకర నియోజకవర్గంలో 100ఏళ్లు పై బడిన 22 మంది ఓటర్లలో ఆమె కూడా ఒకరు. బ్యాలెట్‌ బాక్సుల నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవీఎంలు) వరకు అన్నీ చూసింది ఆసియా అనే 108ఏళ్ల వృద్ధురాలు.

స్వాతంత్య్రానికి ముందు కలర్‌ బాక్స్‌ పద్ధతిలో ఓట్లు వేసిన విషయం ఆమెకు అస్పష్టంగా గుర్తుంది. ఆమె ఫ్రాంచైజీని ఉపయోగించండం ప్రారంభించిప్పుడు, ఆమె అభ్యర్థుల పేరు, సంతకంతో లేబుల్‌ చేయబడిన బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటు వేసే విధానం అందుబాటులో ఉండేది.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఈవీఎంల ద్వారా తన ఓటును నమోదు చేసుకున్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌లో భాగంగా 80ఏళ్లు దాటిని వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఆమె ఓటు వేయడానికి ముందు ఆసియా పిల్లలు, మనవరాళ్లు అభ్యర్థుల గురించి ఆమెకు చెప్పారు. ఇకపోతే, ఆసియా తన బంధువు అహ్మద్‌ను 14ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. పడముగల్‌లోని కన్నుంపురం వద్ద నేయితెల్‌లో అహ్మద్‌తో పాటుగా నివాసం ఉండేవారు. వీరికి 12 మంది సంతానం. కాగా, వారిలో నలుగురు చనిపోయారు.