AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో వింత పాము.. ఎగిరెగిరి చంపుతుంది.. ఈ రహస్యాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..

పాములంటేనే ఒక తెలియని భయం.. అలాంటిది గాలిలో ఎగురుతూ వచ్చి కాటేసే పామే అంటే ఇంకెంత వణుకు పుట్టాలి? అయితే ఈ వింత పాము గురించి వన్యప్రాణి నిపుణులు చెబుతున్న వాస్తవాలు వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.. అది నిజంగానే ఎగురుతుందా? కాటు వేస్తే మనిషి చనిపోతాడా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇదో వింత పాము.. ఎగిరెగిరి చంపుతుంది.. ఈ రహస్యాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..
Can The Takshak Cobra Really Fly
Krishna S
|

Updated on: Mar 04, 2026 | 12:47 PM

Share

ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పాముల విషయానికి వస్తే రకరకాల నమ్మకాలు, భయాలు మనల్ని వెంటాడుతుంటాయి. మనం తరచుగా వినే ఎగిరే పాము గురించి రకరకాల చర్చలు ఉన్నాయి. దీనిని క్రిసోపెలియా ఆర్నాటా లేదా తక్షక నాగు అని కూడా అంటారు. అయితే ఇది నిజంగానే ఎగురుతుందా? దీని విషం ఎంత ప్రమాదకరం? ఈ విషయాలపై వన్యప్రాణి నిపుణుడు స్వప్నిల్ కట్టల్ సంచలన విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో తక్షక నాగు గాలిలో ఎగురుతున్నట్లు చూపిస్తుంటారు. అయితే ప్రపంచంలో ఏ పాము కూడా పక్షుల్లా రెక్కలు ఊపుతూ ఎగరలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ పాము ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకు లేదా నేలపై ఉన్న ఎరపైకి అద్భుతంగా దూకగలదు. చెట్టు పైనుంచి దూకినప్పుడు ఈ పాము తన శరీరాన్ని తెడ్డులాగా వెడల్పుగా మారుస్తుంది. దీనివల్ల గాలిని నిరోధిస్తూ పారాచూట్ లాగా కొంత దూరం వరకు గాలిలో తేలుతూ వెళ్తుంది. ఇది చూడటానికి ఎగురుతున్నట్లు కనిపిస్తుంది తప్ప.. అది నిజమైన ఎగురుడు కాదు.

పేరులో నాగు.. కానీ అది నాగుపాము కాదు

మనం దీనిని తక్షక నాగుపాము అని పిలిచినప్పటికీ ఇది అసలైన నాగుపాము కుటుంబానికి చెందింది కాదు. నాగుపాములు ప్రమాదం వస్తే పడగ విప్పి బుసలు కొడతాయి. వాటి కాటు పడితే అరగంటలో మనిషి ప్రాణాలు పోతాయి. కానీ తక్షక పాముకు పడగ ఉండదు. ఇది బొరియల్లో నివసిస్తూ, ఆహారం కోసం చెట్లపై తిరుగుతుంటుంది.

విషం ప్రాణాంతకమా?

సినిమాల్లో తక్షక నాగును అత్యంత భయంకరమైన విషపూరిత పాముగా చిత్రీకరిస్తారు. కానీ వాస్తవం దీనికి పూర్తి భిన్నం. నిపుణుల ప్రకారం.. తక్షక పాము విషం అంత ప్రమాదకరమైనది కాదు. దీని కాటు వల్ల మనుషులు చనిపోయే అవకాశం లేదు. ఒకవేళ ఇది చిన్నపిల్లలను కరిస్తే.. కేవలం తేలికపాటి విరేచనాలు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. అంతకుమించి ఇది ప్రాణాపాయం కలిగించదు.

అందుకే సోషల్ మీడియాలో లేదా సినిమాల్లో కనిపించే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. తక్షక నాగు ఒక వింతైన, అరుదైన లక్షణాలున్న పాము మాత్రమే తప్ప, అది మనుషులను చంపే రాక్షసి కాదని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర