Shiva lingam: ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారిన అమర్‌కోట్‌.. రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం..

Shiva lingam: ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారిన అమర్‌కోట్‌.. రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం..

Anil kumar poka

|

Updated on: Jun 01, 2022 | 9:55 AM

పాకిస్తాన్‌లో పరమ శివుడికి పూజలందుతున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్‌ రాష్ట్రం ఉమర్‌కోట్‌లోని శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. దేశవిభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో..


పాకిస్తాన్‌లో పరమ శివుడికి పూజలందుతున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్‌ రాష్ట్రం ఉమర్‌కోట్‌లోని శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. దేశవిభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్‌లో గతంలో లక్షలాదిమంది హిందువులు నివసించేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్‌కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్‌ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్‌లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు నిత్యం పూజలందుకుంటున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్‌ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది. మొగల్‌పాలకుడు అక్బర్‌ అమర్‌కోట్‌లోనే జన్మించాడు. క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకువచ్చేవారు. కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలపగా వారు పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటిఉండటాన్ని గమనించవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 01, 2022 09:55 AM