US woman: గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. ఆశలు వదులుకున్న టైమ్‌లో అద్భుతం..!
అద్భుతాలు ఎప్పుడైనా, ఎక్కడైనా జరగొచ్చు. కొన్నిసార్లు మనం ఏమీ ఆశించలేము, కానీ అది ఊహించకుండానే జరుగుతుంది. సోషల్ మీడియాలో అలాంటి అద్భుతం ఒకటి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అద్భుతాలు ఎప్పుడైనా, ఎక్కడైనా జరగొచ్చు. కొన్నిసార్లు మనం ఏమీ ఆశించలేము, కానీ అది ఊహించకుండానే జరుగుతుంది. సోషల్ మీడియాలో అలాంటి అద్భుతం ఒకటి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి అమెరికాలో ఉంటున్న ఓ మహిళ ముందుగా గర్భం దాల్చింది. ఈ వార్తతో ఆమె చాలా సంతోషంలో మునిగితేలింది. కానీ ఆమె చెకప్ కోసం మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు, ఆమెకు ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆ మహిళ మళ్లీ గర్భవతి అని డాక్టర్ చెప్పాడు. అది విన్న ఆమె అవాక్కైంది. ఇదేలా సాధ్యమంటూ వైద్యులను ప్రశ్నించింది. అందుకు సమాధానం ఇచ్చిన వైద్యులు… ఇది ఖచ్చితంగా సాధ్యమేనన్నారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కారా విన్‌హోల్డ్ అనే 30 ఏళ్ల ఈ మహిళ తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని వెల్లడించింది.
అయితే, కారాకు గర్భధారణకు ముందు మూడు గర్భస్రావాలు జరిగాయి. దాంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. మళ్లీ తల్లి కాలేనని భావించిన ఆ దంపతులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ, అదృష్ట వశాత్తు తాను గతేడాది ఫిబ్రవరిలో గర్భం దాల్చింది. తాను గర్భవతి అని తెలిసి ఆమె చాలా సంతోషించింది. మరో మూడు వారాల తర్వత తిరిగి చెకప్ కోసం వెళ్లిన తనకు వైద్యులు ఓ ఆసక్తికర విషయం చెప్పారు. తను మరోమారు గర్భం దాల్చినట్టుగా గుర్తించి చెప్పారు. దానికి ఆ జంట ఒకింత షాక్ అయ్యారు. అదేలా సాధ్యమంటూ వైద్యులను ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అందుకు సమాధానంగా డాక్టర్లు ఇదంతా సాధ్యమేనని వివరించారు. ఈ ప్రక్రియను సూపర్‌ఫెటేషన్ అంటారని తెలిపారు.
సూపర్‌ఫెటేషన్ ..అంటే, ఒకసారి స్త్రీ గర్భవతి అయిన తర్వాత, కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత, స్త్రీ గుడ్డుతో శుక్రకణాల ఫలదీకరణం అదే గర్భంలో జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఏ స్త్రీ అయినా మళ్లీ గర్భవతి కావొచ్చునని వివరించారు. దాంతో ఆమెకు గల సందేహాలన్నీ వీడినట్టైంది. దాంతో ఆమె మరింతగా సంతోషపడింది. ఒక ఆమెకు ఇద్దరు మగపిల్లలు ఆరు నిమిషాల వ్యవధిలోనే జన్మించారు. దాంతో కారా దంపతుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఇది తనకు లభించిన వరమని, అది అద్భుతం కంటే ఎక్కువ అని కారా చెప్పుకొచ్చింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పింది. తనకు పిల్లలు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.