AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి హుండీకి భారీగా ఆదాయం.. ప్రాణహిత పుష్కరాలు, రెండు నెలల్లో భక్తుల ద్వారా..

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి హుండీని లెక్కించారు ఆలయ అధికారులు, సిబ్బంది. ప్రముఖ సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది..ముక్తీశ్వరస్వామి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల హుండీలను విప్పి నగదు లెక్కించారు. కాగా, హుండీ ఆదాయం..

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి హుండీకి భారీగా ఆదాయం.. ప్రాణహిత పుష్కరాలు, రెండు నెలల్లో భక్తుల ద్వారా..
Kaleshwara
Jyothi Gadda
|

Updated on: Jun 01, 2022 | 9:48 AM

Share

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి హుండీని లెక్కించారు ఆలయ అధికారులు, సిబ్బంది. ప్రముఖ సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం.. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వరం అనే గ్రామంలో ఉంది. కాళేశ్వ రంలో కొలువైన ముక్తేశ్వరుడికి తెలంగాణతో పాటు పక్కల రాష్ట్రాల్లోనూ భక్తులు ఎక్కువగా ఉన్నారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల హుండీలను విప్పి నగదు లెక్కించారు. కాగా, హుండీ ఆదాయం రూ.39,94,030 వరకు సమకూరినట్లు ఆలయ ఈఓ ఎస్. మహేష్ తెలిపారు. ఇది గత రెండు నెలల హుండీని లెక్కింగా వచ్చిన ఆదాయంగా చెప్పారు.

ప్రాణహిత పుష్కరాల్లో భక్తుల ద్వారా హుండీలో భక్తులు వేసిన నగదు లెక్కించారు. ఈలెక్కింపులో స్వచ్ఛంద, రాజరాజేశ్వర సేవా సంస్థ వాలింటీర్లు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడి ఈఓ వేణుగోపాల్ పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. ఆలయ సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగదుతో పాటు 5.800 కిలోల మిశ్రమ వెండి, 40.50 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం భక్తుల ద్వారా హుండీల్లో వేశారు. దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన ఇక్కడ శివుడు, యముడి ఆలయాలు ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.. శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.

ఇవి కూడా చదవండి