Kamya Panjabi: పానీపూరి మత్తులో లక్ష రూపాయలు మర్చిపోయిన నటి.. షాకింగ్ ట్విస్ట్!

పానీపూరి ఫ్యాన్స్‌ కేవలం మన దేశంలోనే కాదు, విదేశాలకు చెందిన వారు సైతం ఆస్వాదిస్తారు. పానీపూరి అంటే ప్రజలకు ఎంత ఇష్టమో చెప్పేందుకు ఈ ఘటన ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.

Kamya Panjabi: పానీపూరి మత్తులో లక్ష రూపాయలు మర్చిపోయిన నటి.. షాకింగ్ ట్విస్ట్!
Kamya Panjabi
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 01, 2022 | 7:26 AM

పానీపూరి పేరు వినగానే నోటిలో నీళ్లు ఊరుతాయి.. ఇది తక్కువ ధరలో దొరికే ఒక ప్రసిద్ధ స్ట్రీట్‌ ఫుడ్డే కానీ, దీనికి అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలోనే ఉంటారు. పానీపూరి ఫ్యాన్స్‌ కేవలం మన దేశంలోనే కాదు, విదేశాలకు చెందిన వారు సైతం ఆస్వాదిస్తారు. పానీపూరి అంటే ప్రజలకు ఎంత ఇష్టమో చెప్పేందుకు ముంబైలో జరిగిన ఓ ఘటన చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. ఎందుకంటే, పానీపూరి మత్తులో పడి రూ . ల‌క్ష న‌గ‌దున్న‌ క‌వ‌ర్‌ను మ‌ర్చిపోయింది ఓ ప్రముఖ నటి.. ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అనేక రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఎవరా నటి.. ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

నటి కామ్య పంజాబీకి ఓ వింత అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన ఆ అనుభవాన్ని ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఓ వెంట్‌లో పాల్గొనేందుకు ఇండోర్‌కు వెళ్లిన ఆమె ప్ర‌ముఖ స్టాల్‌లో పానీ పూరీలు రుచిచూసేందుకు స్టాల్‌ను సంద‌ర్శించారు. పానీ పూరీలు తింటూ త‌న ద‌గ్గ‌ర ఉన్న ఎన‌వ‌ల‌ప్‌ను ప‌క్క‌నున్న టేబుల్‌పై పెట్టారట.. ఆపై అక్క‌డి ఫోటోలు తీయ‌డంలో బిజీ అయ్యాన‌ని తిరిగివ‌స్తూ ఎన‌వ‌ల‌ప్‌ను అక్కడే వదిలివేశాన‌ని చెప్పుకొచ్చారు. హోట‌ల్‌కు తిరిగిరాగానే ఎన‌వ‌ల‌ప్‌ను పానీ పూరీ స్టోర్‌లో మ‌రిచిపోయిన విష‌యం గుర్తుకువచ్చిందని, దాంతో తాను చలా ఒత్తిడికి లోనైనట్టు చెప్పింది. కానీ, అదృష్టవశాత్తు తనకు ఎలాంటి నష్టం జరగలేదని వివరించింది.

వెంటనే, ఎన‌వ‌ల‌ప్‌ను తీసుకురావాల‌ని త‌న మేనేజ‌ర్‌ను అక్క‌డికి పంపాన‌ని గుర్తుచేసుకున్నారు. తాము మ‌రిచిపోయిన చోటే ఎన‌వ‌ల‌ప్ ఉన్న‌ట్టు మేనేజ‌ర్ గుర్తించి ఓన‌ర్‌తో మాట్లాడి దాన్ని తిరిగి తీసుకువ‌చ్చాడ‌ని చెప్పారు. అంత బిజీ ప్లేస్‌లో విలువైన ఎన‌వ‌ల‌ప్ దొర‌క‌డం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ని అన్నారు. ఎందుకంటే, క‌వ‌ర్ ఖ‌చ్చితంగా దొర‌క‌ద‌ని ఫిక్స్ అయ్యాము. ఇలాంటివి జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇండోర్ ప్ర‌జ‌లు చాలా మంచివారు ద‌యగలవార‌ని కామ్య పంజాబీ ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, కేవలం పానీ పూరి వల్ల లక్ష రూపాయలు చేజారిపోయేవి అంటూ ఆమె పెట్టిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కామ్య చేసిన పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పలు రకాల కామెడీ మీమ్స్ పెట్టారు.