AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14ఏళ్ల సాహు..పేరుకు తగ్గట్టుగానే మొసలికి చుక్కలు చూపించాడు..దెబ్బకు దాని కళ్లుపోయాయ్..

నీటిలోనూ, నేలమీద బలమైన జలచరజీవి మొసలి.. చాలా క్రూరమైన ప్రాణి కూడా.. దానిని చూస్తేనే భయంకరంగా ఉంటుంది. జూలో అత్యంత భద్రత మధ్య ఉన్నప్పటికీ.. మొసలి వైపు వెళ్లేందుకు చాలామంది జంకుతుంటారు. నీటిలో ఉన్నప్పుడు

14ఏళ్ల సాహు..పేరుకు తగ్గట్టుగానే మొసలికి చుక్కలు చూపించాడు..దెబ్బకు దాని కళ్లుపోయాయ్..
Minor Boy
Follow us
Jyothi Gadda

|

Updated on: May 31, 2022 | 3:31 PM

నీటిలోనూ, నేలమీద బలమైన జలచరజీవి మొసలి.. చాలా క్రూరమైన ప్రాణి కూడా.. దానిని చూస్తేనే భయంకరంగా ఉంటుంది. జూలో అత్యంత భద్రత మధ్య ఉన్నప్పటికీ.. మొసలి వైపు వెళ్లేందుకు చాలామంది జంకుతుంటారు. నీటిలో ఉన్నప్పుడు దాని బలం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఓ భారీ ఏనుగును కూడా అది అమాంతం లాగేసుకుంటుంది.. అయితే, భూమిపైకి వచ్చినప్పుడు దాని బలం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక మొసలితో పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు..దాని నోటికి చిక్కితే ఏదైనా సరే కడుపులోకి పోవాల్సిందే. కానీ ఓ 14 ఏళ్ల బాలుడు మాత్రం మొసలి నోటికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన అతని ధైర్యాన్ని స్థానికులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో జరిగిన ఘటన అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది.

ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని నదితీర ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలుడు కృరమైన మొసలితో పోరాడి గెలిచాడు. ఓం ప్రకాష్ సాహూ అనే బాలుడు పట్టముండై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాజీ గ్రామ సమీపంలోని కణి నదిలో తన స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా, 7 అడుగుల పొడవున్న మొసలి ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, సాహూని ఈడ్చుకుని నీటిలోకి లాక్కేల్లింది. కానీ సాహూ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ మొసలితో ధైర్యంగా పోరాడాడు. ఒక్కసారిగా ఎటాక్‌ చేసిన మొసలిపై బాలుడు కూడా మెరుపు దాడి చేశాడు. తనపై మీదపడ్డ మొసలి నుదిటిపై బలంగా పిడిగుద్దులు గుద్దాడు. అంతే బలంగా కంటిపైనా దాడి చేశాడు. బాలుడి చేతి దెబ్బకు మొసలి పట్టు విడిచింది. వెంటనే అతడు దానికి దూరంగా తప్పించుకు పారిపోయాడు. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ బాలుడిని కుటుంబీకులు, స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. మొదట కేంద్రపరాలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే, కేంద్రపరా జిల్లాలోని బితార్కానికా నేషనల్ పార్క్, దాని చుట్టుపక్కల ఒక నెలరోజుల వ్యవధిలోనే ఇది మూడో మొసలి దాడి. భితార్‌కానికా నేషనల్ పార్క్‌లోని నదీతీర గ్రామమైన ఝరాపాడకు చెందిన 54 ఏళ్ల జానకి జెనా అనే మహిళ మే 26న నదిలో పాత్రలు కడుక్కుంటుండగా మొసలి చేతిలో హత్యకు గురైంది. మే 4న బ్రహ్మణి నదిలో స్నానం చేస్తుండగా భితార్కానికా చుట్టుపక్కల నలపాయి గ్రామానికి చెందిన 40 ఏళ్ల శివప్రసాద్ బెహెరా అనే వ్యక్తిని కూడా మొసలి చంపేసింది.

ఇవి కూడా చదవండి

మొసళ్ళు మానవ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న నదులు, నీటి వనరులు, వాగుల ద్వారా నివాస ప్రాంతాలకు చేరుతున్నాయి. ఇది బితార్కానికా జాతీయ ఉద్యానవనానికి సమీపంలో ఉన్న అనేక ప్రాంతాలలో మొసలి-మనిషి సంఘర్షణకు దారితీసింది. 1,784 వయోజన, బాల్య మొసళ్లకు నిలయంగా ఉన్న బితార్కనికా వన్యప్రాణుల అభయారణ్యం అధికారులు మే 1 నుండి జూలై 31 వరకు పర్యాటకులు, సందర్శకులను జాతీయ పార్కులోకి ప్రవేశించడాన్ని మూడు నెలల పాటు నిషేధించారు.