Viral Video:”కష్టాలు ఎవరికీ ఊరికే రావు’ కష్టాలకు కారణం చెప్పిన యువకుడు..! వైరల్ వీడియో..
హైదరాబాద్ నగర రోడ్లపై ఓ విచిత్ర బోర్డుతో ఓ యువకుడి బైక్ కనిపించింది. అతడి బైక్ వెనకాల నెంబర్‌ప్లేట్ అడుగు బాగాన ఓ పలక వేలాడదీసి ఉంది..ఆ పలక మీద..
వివాహం విద్యానాశనం.. శోభనం సర్వనాశనం! అన్నారు పెద్దలు.. భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచీలరు,..సోలో బ్రతుకే సో బెటరు..అన్నది మనీ మనీ సినిమాలోని ఓ పాట. అప్పట్లో ఈ పాట బాగా ఫేమస్. ఇక కొంతకాలం క్రితం హీరో నాగార్జున నటించిన మన్మథుడు మూవీలోనూ పెళ్లి చేసుకోవద్దని సూచించే మరో పాట కూడా ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంది. వద్దురా సోదరా..పెళ్లంటే నూరేళ్ల మంటరా,..ఆదరా బాదరా నువ్ ఎల్లెల్లి గోతిలో పడ్డొదురా.. అంటూ హీరో నాగార్జున ఈ పాట పాడుతాడు.. తన ఆఫీస్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పెళ్లికి వెళ్లి అక్కడ ఫుటుగా తాగేసి మగవాళ్లందరికీ ఈ పాటతో పెళ్లి చేసుకోవద్దనే సందేశం ఇస్తాడు..ఈ మాటలన్నీ వింటుంటే…బ్రహ్మచారులంతా తెగ సంబరపడిపోతారు. ఇక పెళ్లి చేసుకున్నవారు ఎస్ బాస్, నిజమే నంటూ నిట్టూరుస్తారు..అయితే, ఇప్పుడు ఇదంతా ఎందుకనే సందేహం వస్తుంది కదా..? అది చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది..
హైదరాబాద్ నగర రోడ్లపై ఓ విచిత్ర బోర్డుతో ఓ యువకుడి బైక్ కనిపించింది. అతడి బైక్ వెనకాల నెంబర్‌ప్లేట్ అడుగు బాగాన ఓ పలక వేలాడదీసి ఉంది..ఆ పలక మీద సుద్దముక్కతో కాస్త పెద్ద సైజులో ఏదో రాసి ఉంది..దూరం నుండి అదేదో నోటిస్ అనుకున్నారు అంతా..అంటే, అత్యవసర విధుల్లో ఉన్నవారు తమ వాహనాలకు ఇలాంటి నోటీసులు అంటించుకోవటం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం..కానీ, ఇక్కడ కనిపించింది అలాంటి నోటీస్ బోర్డు కాదు..చూస్తే తెగ నవ్వుకుంటారు..వీడెవడండి బాబు..ఇలా రాసిపెట్టాడు. అని ముక్కేన వేలేసుకుంటారు..ఇంతకీ ఆ బోర్డుపై ఏం రాసి ఉంది అంటే..
డబ్బులు ఎవరికీ ఊరికే రావు..కష్టపడి సంపాదించాలి..అన్నది లలితా జ్యువెలరీ ఓనర్ కిరణ్ చెప్పిన డైలాగ్. ఈ మాటలను కాస్త అటు ఇటుగా మార్చేసిన ఓ యువకుడు కష్టాలు ఎవరికీ ఉరికెనే రావు..పెళ్లి చేసుకుంటేనే వస్తాయి…అని మార్చేశాడు..రోడ్డుపై కనిపించిన ఈ వింత నోటీస్‌ని వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీశారు. ఇంకేం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటమే తరువాయి…వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్ల చేతుల్లో పడి తెగ దూసుకుపోతోంది.