HDFC Mangalagiri: చిరు వ్యాపారి పెద్ద మనసు.. కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశాడు..

ఎవరికైనా ఉత్త పుణ్యానికి డబ్బులు ఏం చేస్తారు..హాయిగా వాడేసుకుంటారు..కాదా..? కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం తనకు అనుకోకుండా వచ్చిన కోట్ల రూపాయల డబ్బును తనది కాదని తెలిసి తిరిగి ఇచ్చేశాడు..ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..? అని ఆశ్చర్యపోకండి..ఎందుకంటే.

HDFC Mangalagiri: చిరు వ్యాపారి పెద్ద మనసు.. కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశాడు..
Hdfc Mangalagiri
Follow us

|

Updated on: May 31, 2022 | 12:53 PM

ఎవరికైనా ఉత్త పుణ్యానికి డబ్బులు ఏం చేస్తారు..హాయిగా వాడేసుకుంటారు..కాదా..? కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం తనకు అనుకోకుండా వచ్చిన కోట్ల రూపాయల డబ్బును తనది కాదని తెలిసి తిరిగి ఇచ్చేశాడు..ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..? అని ఆశ్చర్యపోకండి..ఎందుకంటే..అలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే బ్యాంక్‌ సిబ్బంది పొరపాటు కారణంగా తన ఖాతాలో పడ్డ నగదును వాదనుకున్నాడు. అది కూడా వందలు వేలు, లక్షలు కూడా కాదు..ఏకంగా కోటి పన్నెండు లక్షలు తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలుగుచూసింది.

మంగళగిరి మెయిన్ బజార్ లో గౌరీ శంకర్ ఫ్యాన్సీ షాపు ఉంది. గత కొన్నేళ్ళుగా షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో ఖాతా ఉంది. వ్యాపార నిమిత్తం ఈ ఖాతా నుండే లావా దేవీలు చేస్తుంటాడు. ఆదివారం సెలవు కావటంతో షాపు తీయలేదు. ఇంట్లో అందరితో కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్న సమయంలో అతని సెల్ ఫోన్ కు ఒక మెస్సెజ్ వచ్చింది. ఆ మెస్సెజ్ చూసి గౌరీ శంకర్ ఆశ్చర్య పోయాడు. కుటుంబ సభ్యులందరికి ఆ మెస్సెజ్ గురించి చెప్పాడు. అది విన్న వారంతా కూడా మరింతగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ మెస్సెజ్ సారాంశం ఏమిటంటే… హెచ్ డి ఎఫ్ సి లోని మీ ఖాతాకు కోటి పన్నెండు లక్షలు జమ అయ్యాయని.

చిన్న షాపు నిర్వహించే తనకు అంత పెద్ద మొత్తంలో అమౌంట్‌ రావడంతో ఆశ్చర్యానికి గురైన వ్యాపారి,.. అది ఫేక్ మెస్సెజ్ అనుకున్నాడు. అయినా చెక్ చేసుకొని చూద్దామని తనకు వచ్చిన మొత్తంలో నుండి లక్ష రూపాయలను ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేయగా అవి వెళ్ళాయి‌. దీంతో నిజంగానే అమౌంట్ పడినట్లు నిర్థారించుకున్న వ్యాపారి తనది కాని సొమ్ము తనకి అక్కర్లేదనుకున్నాడు. మరుసటి రోజు మంగళగిరిలోని బ్యాంక్ వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. అప్పటి వరకూ ఆ విషయం తెలియని బ్యాంక్ అధికారులు ముందు ఆశ్చర్యపోయిన తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు.

ఇవి కూడా చదవండి

సాంకేతిక లోపంతో అమౌంటు జమ అయినట్లు గుర్తించామని ఉన్నతాధికారులు చెప్పారు. వెంటనే గౌరి శంకర్ ఖాతా నుండి ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. తనకు పడిన మొత్తాన్ని బ్యాంక్ దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆమొత్తాన్ని వెంటనే తిరిగి ఇచ్చిన గౌరి శంకర్ బ్యాంక్ సిబ్బంది అభినందించారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.