Hanuman Birthplace: అంజనీపుత్రుడు పుట్టింది ఎక్కడ..? పురాణ ఇతిహాసాలు ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడని చెబుతున్నాయంటే..
Hanuman Birthplace: అంజనీపుత్రుడు పుట్టింది ఎక్కడ? పురాణ ఇతిహాసాలు ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడని చెబుతున్నాయి? ఈ ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు. సవాళ్లు, వాదనలు, ఆధారాల కంటే ముందు ఏయే ప్రాంతాలు క్లైయిమ్ చేసుకుంటున్నాయో చూద్దాం.
హనుమంతుడి జన్మస్థలిపై(Hanuman Birthplace) మళ్లీ జగడం మొదలైంది. ఇంతకీ అంజనీపుత్రుడు పుట్టింది ఎక్కడ? పురాణ ఇతిహాసాలు ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడని చెబుతున్నాయి? ఈ ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు. మారుతీ మావాడేనంటూ చాలా ప్రాంతాలు క్లైయిమ్ చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏది నిజం అన్నది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. హన్మంతుడు పుట్టింది మా దగ్గరే అంటోంది కర్నాటక. ఆ వాదనను కొట్టిపడేస్తోంది టీటీడీ. అంజనాద్రే అసలు పుట్టినిల్లని ఆధారాలు కూడా చూపిస్తోంది. ఆంజనేయుడు నడయాడిన నేల మాదేనంటోంది హర్యానా. ఎవరి వాదన వాళ్లే వినిపిస్తున్నారు. ఎవరైనా ఓపెన్ డిబేట్‌కు రావొచ్చని సవాల్ కూడా విసురుతున్నారు. సవాళ్లు, వాదనలు, ఆధారాల కంటే ముందు ఏయే ప్రాంతాలు క్లైయిమ్ చేసుకుంటున్నాయో చూద్దాం.
1. అంజనాద్రి – తిరుమల మారుతి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అనే వాదన పచ్చని కొండల నుదుటిన ఎర్రని సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహా తీర్థం జన్మస్థలం అని చరిత్రకారులు, పురాణ, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ మధ్య టీటీడీ ఓ కమిటీ వేసి నిర్దారించింది.
2. కిష్కింద – కర్నాటక చాలామంది భక్తుల విశ్వాసం కర్నాటకలోని కిష్కంద. ఇక్కడే హనుమంతుడు జన్మించి ఉంటారని కర్నాటక వాసుల గట్టినమ్మకం.
3. హంపి – కర్నాటక హంపిలోనే మారుతి జన్మించాడని కూడా చాలామంది ప్రజల విశ్వాసం.
4. గోకర్ణ – కర్నాటక కర్నాటకలోని మరో గోకర్ణలోనూ వీర హనుమాన్ అసలైన జన్మభూమి అనే అభిప్రాయాలున్నాయి.
6. అరేబియా సముద్రం ఒడ్డున – కర్నాటక కర్నాటకలోని అరేబియా సముద్రం ఒడ్డున అనే మరో వాదన ఉంది.
7. నాసిక్ (అంజనేరి) – మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఆంజనేరి పర్వతాల్లో జన్మించారని మరో వాదన తెరపైకి వచ్చింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి, శ్రీ మండలాచార్య మహంత్ పీఠాదిపది స్వామి అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే మహారాజ్ ఇవాళ నాసిక్‌లో ధర్మ సంసద్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంసద్ లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు తరలివచ్చి హనుమంతుడి జన్మస్థలంపై తమ అభిప్రాయాలను తెలపనున్నారు. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది.
8. నవసారి – గుజరాత్ ఇది గిరజనుల ప్రాంతం…ఇక్కడ కూడా ఓ అంజనా పర్వతం తో పాటు ఓ గుహ కూడా కనిపిస్తుంటుంది. అందులోనే అంజనీ దేవి హనుమంతుడికి జన్మనిచ్చిదన్నది భక్తుల విశ్వాసం.
9. అంజన్ – జార్ఖండ్ జార్ఖండ్ గుమ్లాలోని అంజన్ గ్రామ ప్రామంత హనుమంతుడి జన్మస్థలంగా అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఇక్కడ అంజనీదేవికి గుడి కూడా ఉంది. వాలి, సుగ్రీవుల రాజ్యం ఇదేనన్నది ప్రజల నమ్మకం.
10. కపితల్ – హర్యానా హర్యాన కపితల్ ప్రాంతం కూడా ఆంజనేయుని జన్మస్థలంగా క్లెయిమ్ చేసుకుంటోంది. ఈ ప్రాంతాన్ని కపిరాజు కేసరి పాలించడాని..ఇక్కడే మారుతి పుట్టాడన్నది స్థానికుల నమ్మకం.
11. లక్షక గుట్టలు – రాజస్థాన్ రాజస్థాన్, చురు జిల్లా, సుజన్ గఢ్ సమీపంలోని లక్షక గుట్టలు హనుమంతుడి జన్మస్థలం అని కూడా చెబుతుంటారు…
12. హనుమాన్ ధోకా – నేపాల్ సప్తరిలోని రాజ్‌బీరాజ్ నడిబోడ్డున హిందూ దేవాలయం ఉంది. అందులో శివాలయంతో పాటు హనుమాన్ దేవాలయం ఉంది. ఇక్కడే అంజనేయ స్వామి జన్మించారనే వాదనలు ఉన్నాయి.