- Telugu News Photo Gallery Spiritual photos Bamboo plant vastu tips in telugu: plant a bamboo plant to maintain happiness and peace in house
Bamboo plant Vastu Tips: ఇంట్లో సుఖ సంపదల కోసం వెదురు మొక్కను ఏ దిశలో పెంచుకోవాలంటే
Bamboo plant Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కల వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అభివృద్ధికి మార్గం తెరుచుకుంటుంది. జీవితంలో ఆనందం తెస్తుంది. ఇతర ప్రయోజనాలను కూడా ఈరోజు తెలుసుకుందాం.
Updated on: May 31, 2022 | 2:01 PM

వెదురు మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, వాస్తు ప్రకారం.. ఆనందం, సంపదను తీసుకుని వస్తాయని నమ్మకం. అందుకనే ఈ మొక్కలను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకోవడం ద్వారా ప్రతికూలత తొలగిపోతుందని నమ్మకం

ఇంటి నుండి ప్రతికూలతను తొలగించడంలో వెదురు మొక్కలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయి. ఇంట్లో, ఆఫీసులో వెదురు మొక్కను ఉంచడం శ్రేయస్కరం.

వెదురు మొక్కలను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. మీరు మీ ప్రియమైన వారికి ఈ మొక్కలను బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. ఈ మొక్కను తూర్పు దిశలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, సంపదకు కొరత ఉండదు.

దీన్ని ఇంట్లో పెట్టుకుంటే శాంతి నెలకొంటుంది. ఇంటి సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.

వెదురు మొక్కలు ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ ఇండోర్ ప్లాంట్లు పర్యావరణాన్ని శుభ్రపరుస్తాయి. గాలిని శుద్ధి చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)




