EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ పని పూర్తిచేయకపోతే మీ ఖాతా క్లోజ్ అయినట్లే.. ఎలాగంటే..

ఈ పీఎఫ్ ఖాతాల్లోని అమౌంట్‏లో ఈపీఎఫ్ నియమనిబంధనల ప్రకారం విత్ డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ పని పూర్తిచేయకపోతే మీ ఖాతా క్లోజ్ అయినట్లే.. ఎలాగంటే..
Epfo
Follow us

|

Updated on: May 31, 2022 | 12:18 PM

ప్రభుత్వ.. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ ఖాతా గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ప్రతి నెలా జీతం నుంచి కొంత అమౌంట్ కట్ అయి పీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్ అవుతుంది.. ఈ పీఎఫ్ ఖాతాల్లోని అమౌంట్‏లో ఈపీఎఫ్ నియమనిబంధనల ప్రకారం విత్ డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. అయితే పీఎఫ్ ఖాతా కల్గిన వినయోగదారులు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.. లేదంటే మీ ఖాతా క్లోజ్ కావడం.. లేదా తదితర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సాధారణంగా ఏ ఉద్యోగి అయినా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు తన పీఎఫ్ ఖాతాలోని డబ్బును విత్‌డ్రా చేసుకోవడం గానీ.. లేదా కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవడం గానీ జరుగుతుంది. అయితే మీరు జాబ్ మానేసి.. ఆ తర్వాత ఎలాంటి కంపెనీలోకి చేరకపోయి ఉంటే.? మీ పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుందని తెలుసుకోండి.

పీఎఫ్ ఖాతాలో దాదాపు 3 ఏళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోతే.. ఆ అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఈపీఎఫ్ఓ ఇలాంటి ఖాతాలను ‘ఇన్‌ఆపరేటివ్’గా పరిగణనలోకి తీసుకుంటోంది. మళ్లీ దాన్ని తిరిగి యాక్టివ్‌గా చేయాలంటే.. మీరు నేరుగా ఈపీఎఫ్ఓకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. పీఎఫ్ ఖాతా ‘ఇన్‌ఆపరేటివ్’గా ఉన్న సమయంలో మీ డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2016లో సవరించిన నిబంధనల ప్రకారం.. జమ కావాల్సిన వడ్డీ యధావిధిగా పడిపోతుంది.

న్యూ రూల్స్ ఇలా ఉన్నాయి..

ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బును విత్‌డ్రా కోసం దరఖాస్తు చేసుకోనట్లయితే.. ఆ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అవుతుంది. అలాగే రిటైర్మెంట్ అయిన 36 నెలలు దాటినా.. సభ్యుడు మరణించినా ఖాతా ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఇక ఇలాంటి పీఎఫ్ ఖాతాల నుంచి క్లెయిమ్‌లు విత్‌డ్రా చేయాలంటే.. ఉద్యోగి యజమాని ధృవీకరణ చాలా అవసరం. ఒకవేళ కంపెనీ మూసినట్లయితే.. KYC పత్రాల ఆధారంగా బ్యాంక్ ఆ డబ్బును ఖాతాదారుడికి అందజేస్తుంది.