Sivakarthikeyan: శివ కార్తికేయన్ SK20 రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో విడుదలయ్యేది అప్పుడే..

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా

Sivakarthikeyan: శివ కార్తికేయన్ SK20 రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో విడుదలయ్యేది అప్పుడే..
Sivakarthikeyan
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:34 PM

రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఆ తర్వాత సీమరాజా, కౌసల్య కృష్ణమూర్తి వంటి చిత్రాలతో మెప్పించాడు.. ఇటీవల విడుదలైన వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో #SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ‘కాలేజ్ డాన్’ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై హీరో శివకార్తికేయన్ ని నిర్మాత సురేష్ బాబు అభినందించారు. అలాగే SK20విడుదల తేదీని కూడా ప్రకటించారు.

“#SK20 చిత్రాన్ని వినాయక చవితి పర్వదినాన తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్‌లు త్వరలో వెల్లడిస్తాం’’అని తెలిపారు సురేష్‌బాబు. ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ట్వీట్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే